తాగునీటి సరఫరా బకాయిలు రూ. 40.50 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-06-02T09:43:04+05:30 IST

జిల్లాలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసినందుకుగానూ పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ.

తాగునీటి సరఫరా బకాయిలు రూ. 40.50 కోట్లు విడుదల

కలికిరి, జూన్‌ 1: జిల్లాలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసినందుకుగానూ పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ. 40 కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబరు నెల వరకూ వున్న బకాయిలను చెల్లించడానికి ఈ నిధులను విడుదల చేసింది. ట్యాంకర్ల ద్వారా తాగు నీటి సరఫరా, ప్రైవేటు బోర్లకు అద్దెలు, తాగునీటి బోర్లు లోతు చేయడం, సమ్మర్‌ స్టోరేజీలకు నీటిని సరఫరా చేయడం వంటి పనులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నిధుల ద్వారా చెల్లించాలని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం విడుదల చేసిన వుత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా ఈ పెండింగ్‌ బిల్లులను చెల్లించనున్నారు. 

Updated Date - 2020-06-02T09:43:04+05:30 IST