Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇమ్యూనిటీ పెంచే పానీయం!

ఆంధ్రజ్యోతి(02-06-2020)

శరీర శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే అందుకు తోడ్పడే పానీయాన్ని ప్రతిరోజూ సేవించాలని ఆయుర్వేదం చెబుతోంది. వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆ పానీయం ఎలా తయారుచేయాలంటే...


కావలసిన పదార్థాలు: పది బాదం గింజలను నానబెట్టి, పొట్టు తీసి పెట్టుకోవాలి. 5 ఖర్జూరాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి విత్తనాలు తీసి ఉంచుకోవాలి. ఒక కప్పు ఆవు పాలు దగ్గర పెట్టుకోవాలి. అర టీస్పూను పసుపు, అంతే పరిమాణంలో యాలకుల పొడి, నెయ్యి, తేనె చెరొక టీస్పూను దగ్గర పెట్టుకోవాలి.


తయారీ విధానం: బాదం, ఖర్జూరం, పసుపు, యాలకుల పొడి, నెయ్యి బ్లెండర్‌లో వేసి తిప్పాలి. ఇలా రెండు, మూడు సార్లు మిశ్రమం బాగా కలిసేవరకూ తిప్పి, గ్లాసులో నింపాలి. తేనె కలిపి  సేవించాలి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...