జగన్‌ లేఅవుట్లలో సమస్యలపై ఏకరువు

ABN , First Publish Date - 2022-05-19T06:50:09+05:30 IST

‘‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్లే అనేకమంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.

జగన్‌ లేఅవుట్లలో సమస్యలపై ఏకరువు

  మౌలిక సదుపాయాలు తక్షణం కల్పించాలని సూచన
 ప్రైవేటు లేఅవుట్ల మాదిరిగా అభివృద్ధి చేస్తే లబ్ధిదారులు ముందుకొస్తారు
  ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం  : బోస్‌  
వాడివేడిగా డీఆర్‌సీ సమావేశం

రాజమహేంద్రవరం, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్లే అనేకమంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇళ్లు కట్టుకున్నవారికి ఇంకా విద్యుత్‌, మంచినీరు, రోడ్లు, డ్రైన్ల వం టి సౌకర్యాలు కల్పించలేదు. ఇంకా చాలా లేఅవుట్లు ఫిల్లింగ్‌ చేయవలసి ఉంది. కానీ మైన్స్‌ అధికారులు సీనరేజి కట్టమంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వెంటనే ఫిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని’’ పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు కోరారు. ఇక జూన్‌ ఒకటన ఖరీఫ్‌ కోసం కాలువలకు నీరు వదలడం మంచిదే. కానీ కాలువల్లో పూడికలు తీయకపోతే సమస్య ఉంది. కొన్నిచోట్ల క్రాప్‌ హాలిడేకు వెళ్లే ప్రమాదం ఉందని వారు స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో పేద రైతులకు అన్యాయం జరుగుతుందనే వాదన కూడా ప్రజాప్రతినిధుల వినిపించింది. స్థానిక నగరపాలకసంస్థ సమావేశపు హాల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, బీసీ వెల్ఫేర్‌, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్‌సీ)లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు మాట్లాడారు. జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి తారాచంద్‌ మాట్లాడుతూ జిల్లాలో 47,503 ఇళ్లు మంజూరుకాగా, ఇప్ప టివరకూ 43,226 గ్రౌండయ్యాయని, 2830 మాత్రమే పూర్తయ్యాయని, వాటికి రూ.108 కోట్లు ఖర్చుచేశామన్నారు. మంత్రి వేణు జోక్యం చేసుకుని, తక్కువ పూర్తయ్యాయికదా, లబ్ధిదార్లను ఎలా మోటివేట్‌ చేస్తున్నారన్నారు. రూ.35 వేల నుంచి 50 వేల వరకూ డీఆర్‌డీఏ ద్వారా లోన్‌ ఇవ్వనున్నామని, ఎవరైనా ముం దుకు వస్తే వెంటనే లోను వస్తుందని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోసు మాట్లాడుతూ ఇంకా 19 వేల ఇళ్ల వరకూ  పునాదుల స్థాయిలో ఉన్నాయంటే ఎలా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ‘2020లోనే 15 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు.. కానీ జిల్లాలో కేవలం రూ.108 కోట్లు ఖర్చు చేశారు. అయినా రూ.లక్షా 80 వేలతో ఇల్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు. అందుకే మరో రూ.50 వేల రుణం ఇప్పిస్తున్నామని మంత్రి వేణు తెలిపారు. నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నే అధికంగా నిడదవోలులో 1400 ఇళ్లు పూర్తయ్యాయని, కానీ వారికి విద్యుత్‌ సౌకర్యం ఇవ్వలేదన్నారు. స్టీల్‌, సిమెంట్‌ ధరలు పెరగడంతో సరఫరా ఆలస్య మైందని, వారం రోజుల్లో ఐరన్‌ కూడా ఇస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. వానాకాలం రాబోతున్నందున ముందుగా ఇసుక స్టాక్‌లు పెట్టుకోవాలని, లేకపోతే ఇసుక లేక ఇళ్ల నిర్మాణాలు ఆగిపోతే మాట వస్తుందన్నారు. కొన్ని లేఅవుట్లు ఇంకా ఫిల్లింగ్‌ చేయవలసి ఉంది. దానికి సెస్‌ కట్టమంటున్నారు. వాటికి త్వరగా అనుమతి ఇవ్వాలని కోరారు. కొవ్వూరు, నిడదవోలులలో ఒకే కాంట్రాక్టర్‌ తీసుకుని, పని ఆపి కోర్టుకెళ్లారన్నారు. దీనిపై కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఇరిగేషన్‌, మైన్స్‌ అధికారులు సమన్వయం చేసుకోవాలని, సీనరే జ్‌ చివరి బిల్లులో వస్తుందని, దానికి ఇబ్బంది లేదని, వెంటనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ లేఅవుట్ల మాదిరిగా ముందుగానే రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌, మంచినీటి సౌకర్యాలు, గుడి, పార్కు, స్మశానవాటికలు అభివృద్ధి చేస్తే, లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి వస్తారని సూచించారు. గడపగడపకూ వెళ్లినప్పుడు కొందరు ఇవే అడుగుతున్నారని, నియోజకవర్గానికి ఓ మోడల్‌ లేఅవుట్‌ సిద్ధం చేయాలన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ ఇటువంటి సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేసే ప్రజలు ముందుకు రావడానికి బాగుంటుందన్నారు. జేగురుపాడు, అనపర్తి, రాజానగరంలలో పూర్తయిన ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం ఇస్తే గృహ ప్రవేశాలు ఉంటాయ ని ఎమ్మెల్యేలు సూచించినట్టు పీఆర్‌ అధికారులు తెలిపారు. రాజానగరం ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఏ లేఅవుట్‌ ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు స్వాధీనం చేస్తారో స్పష్టంచేయాలని కోరారు. కొన్ని లేఅవుట్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. దానికి సంబంధించి మాకు ఒక కాగితం కూడా దొరకడంలేదు. దీనిపై లైజన్‌ అధికారిని నియమించాలని కలెక్టర్‌ను కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ తన నియోజకవర్గం అర్బన్‌ ఏరియా కాకపోవడం వల్ల ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నానని, రెండో దశలో వస్తాయని చెబుతున్నారన్నా రు. మంత్రి వేణు మాట్లాడుతూ అదే సమస్య తన నియోజకవర్గంలో కూడా ఉందన్నారు. రుడా పరిధిలోకి తెస్తామని కలెక్టర్‌ తెలిపారు. టిడ్కో ఇళ్లకు సం బంధించి తొర్రేడు, బొమ్మూరుల్లో కొన్నింటికి మౌలిక సదుపాయాలు కూడా పూర్తయ్యాయని, రిజిస్ర్టేషన్లు కూడా జరుగుతున్నాయని, ఈనెలాఖరుకి లబ్ధిదార్లకు అప్పగిస్తామని టిడ్కో అధికారి తెలిపారు. దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్యే చిక్కాల రామచంద్రరావు జోక్యం చేసుకుని, తమ ప్రభుత్వం హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మరో పది శాతం మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇప్పటివరకూ ఇళ్లు లబ్ధిదార్లకు అప్పగించలేదన్నారు. బ్యాంక్‌ రుణాలు పెండింగ్‌లో ఉన్నాయా, రాష్ట్రంలో సుమారు 51 వేల టిడ్కో ఇళ్లను రద్దు చేశారని, ఈ జిల్లాలో కూడా కొన్ని ఆగిపోయాయని తెలిపారు. మంత్రి వేణు, కలెక్టర్‌ మాధవీలత జోక్యం చేసుకుని, జూన్‌ నెలకు కొన్ని, డిసెంబర్‌లో మిగతావి ఇచ్చేటట్టు ప్రణాళికతో పనిచేయాలని, ఇంతవరకూ ఎస్‌టీపీ కూడా నిర్మించి ఇవ్వడం కోసమే ఆలస్యమైందన్నారు. అంతకుముందు నాడు-నేడు, సివిల్‌ సప్లయిస్‌, వైద్య ఆరోగ్య తదితర అంశాలపై సమీక్షించారు. రాజ్యసభ సభ్యుడు సుభాష్‌చంద్రబోసు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతోందని, ఇదో పెద్ద కుంభకోణమని, దీనిపై సీఐడీ విచారణ జరిపించాలన్నారు. మంత్రులు వేణు, తానేటి వనితలు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధు ల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు షేక్‌ సాబ్జి, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, జేసీ శ్రీధర్‌, కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీవో చైత్రవర్షిణి, జడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాల్‌, కవురు శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు, మత్సశాఖ అధికారి వి.కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌టీజీ గోవిందం, జిల్లా హౌసింగ్‌ అధికారి తారాచంద్‌, పౌర సరఫరాల అఽధికారి టి.తులసి, సాంఘిక సంక్షేమాధికారి ఎమ్మెస్‌ శోభారాణి, ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, డీఈవో అబ్రహాం, హార్టికల్చర్‌ అధికారి రాధాకృష్ణ, డీఎం అండ్‌హెచ్‌వో స్వర్ణలత, డీసీహెచ్‌వో సనత్‌కుమారి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:50:09+05:30 IST