వడ్డాది కూడలిలో డ్రైనేజీ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-09T06:53:34+05:30 IST

మండలంలోని వ డ్డాది కూడలిలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా వడ్డాది వంతెన నుంచి కూడలి వరకు ఎక్స్‌కవేటర్‌తో కాలువ పనులు చేపట్టారు.

వడ్డాది కూడలిలో డ్రైనేజీ పనులు ప్రారంభం
వడ్డాదిలో ఎక్స్‌కవేటర్‌తో డ్రైనేజీ తవ్వుతున్న దృశ్యం


బుచ్చెయ్యపేట, ఆగస్టు 8: మండలంలోని వ డ్డాది కూడలిలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా వడ్డాది వంతెన నుంచి కూడలి వరకు ఎక్స్‌కవేటర్‌తో కాలువ పనులు చేపట్టారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ వేణుగోపాలరావు కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  72/0 నుంచి 72/8 వరకు తారు రోడ్డు పనులు, వడ్డాది కూడలి ఎత్తు చేయడం, కూడలి నుంచి వంతెన వరకు వీఎన్‌ రోడ్డు కిరువైపులా సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.70 లక్షలతో టెండర్‌ ఖరారు అయిందన్నారు. ఇందులో రూ.21 లక్షలు సీసీ డ్రైనేజ్‌ నిర్మాణానికి కాగా మిగిలిన నిధులు తారురోడ్డుకు వ్యయం చేస్తామన్నారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ మాడుగుల సెక్షన్‌ ఏఈఈ సాయి శ్రీనివాస్‌, వైసీపీ వడ్డాది పట్టణ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి ఉన్నారు. 



Updated Date - 2022-08-09T06:53:34+05:30 IST