డ్రైనేజీ నీటిని బావిలోకి మళ్లించారు

ABN , First Publish Date - 2022-05-22T06:33:10+05:30 IST

బావిలోకి డ్రైనేజీ నీటిని మళ్లించి పంట లు పండకుండా చేస్తున్నారని పలువురు రై తులు ఆందోళన చేప ట్టారు.

డ్రైనేజీ నీటిని బావిలోకి మళ్లించారు
పానగల్‌లో రాస్తారోకో చేస్తున్న రైతులు

నల్లగొండ, మే 21: బావిలోకి డ్రైనేజీ నీటిని మళ్లించి పంట లు పండకుండా చేస్తున్నారని పలువురు రై తులు ఆందోళన చేప ట్టారు. జిల్లా కేంద్ర స మీపంలోని పానగల్‌లోని పచ్చల సోమేశ్వరాలయం సమీపంలో ఉన్న బావిలోకి డ్రైయినేజీ నీటిని మళ్లించారని ఆరోపిస్తూ శనివారం పానగల్‌ సూరారం రోడ్డులో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లు కావాలనే తన వ్యవసాయ బావిలోకి మురుగునీరును మళ్లించి పంటలు పండకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. రోడ్డు వెంట డ్రైనేజీని తీసుకెళ్లి కాల్వలో కలపాల్సిన కాంట్రాక్టర్‌ కావాలనే త న వ్యవసాయ బావిలోకి మళ్లించారని ఆరోపించారు. మురుగు నీటి వల్ల దిగు బడి రావడంల లేదని, బాగా గడ్డి పెరిగి కనీసం దున్నడానికి కూడా వీలు కలగ డం లేదన్నారు. బావి కింద సుమారు 100ఎకరాల వరకు సాగవుతుంది. అయితే గతేడాది నుంచి మూడు పంటలు పండకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డ్రైనేజీని కాల్వలో కలపాలని, తమ వ్యవసా య బావిలోకి నీరు రాకుండా చూ డాలని కోరారు. కార్యక్రమంలో రై తులు కొప్పు ప్రశాంత,  జానయ్య, రాములు, శ్రీకాంత పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:33:10+05:30 IST