డాక్టర్‌ సుబ్బరాజు గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-05-05T06:31:44+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు అల్లూరి విష్ణు మూర్తి సుబ్బరాజు (67) మంగళవారం మృతి చెందారు.

డాక్టర్‌ సుబ్బరాజు గుండెపోటుతో మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 4: తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు అల్లూరి విష్ణు మూర్తి సుబ్బరాజు (67)  మంగళవారం మృతి చెందారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయన ఇండియన్‌ మెడికల్‌ అసొషియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2021-05-05T06:31:44+05:30 IST