AP: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం

ABN , First Publish Date - 2021-07-23T14:09:39+05:30 IST

దవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 8.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది.

AP: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం

రాజమండ్రి: దవళేశ్వరం బ్యారేజి వద్ద  గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 8.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేశారు. దాదాపులక్షా 10 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు రెండు వేల క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ కారణంగా దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ముంపులోనే ఉండిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో వరి నాట్లు, కూరగాయల పంటలు  నీటమునిగాయి. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

Updated Date - 2021-07-23T14:09:39+05:30 IST