Abn logo
Sep 16 2021 @ 23:51PM

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు : స్పీకర్‌

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నస్రుల్లాబాద్‌, సెప్టెంబరు 16 : బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అర్హులై న వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం నస్రుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ క్యాంపు, అంకోల్‌ తండా, అంకో ల్‌ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. అంకోల్‌ క్యాం పు వద్ద నుంచి మెయిన్‌ రోడ్డు నుంచి హజీపూర్‌ గ్రామం వరకు రూ.6 కోట్లతో డబుల్‌ రోడ్డు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అంకోల్‌ గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన కుర్మ సంఘం, మత్స్యశాఖ సంఘ భవనాలను ప్రారంభించారు. అనంతరం అంకోల్‌ తండాలో నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి, మరో 15 డబుల్‌బెడ్‌ రూంలకు శంకుస్థాపన చేశారు. రూ.18 లక్షలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే 10 వేల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. మరో 5 వేల ఇళ్లను తెచ్చి మిగిలిన పేదలందరికీ త్వరలోనే మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్ర మంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌ రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్‌, జడ్పీటీసీ జన్నుబాయి ప్రతాప్‌, తదితరులున్నారు.