అతడు నా బంధువే.. విషయాన్ని పెద్దది చేయకండి: డీకే శివకుమార్

ABN , First Publish Date - 2021-07-12T01:34:39+05:30 IST

పార్టీ కార్యకర్తపై తాను చేయి చేసుకోవడం వివాదాస్పదం కావడంతో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆదివారం నాడు స్పందించారు.

అతడు నా బంధువే.. విషయాన్ని పెద్దది చేయకండి: డీకే శివకుమార్

బెంగళూరు: పార్టీ కార్యకర్తపై తాను చేయి చేసుకోవడం వివాదాస్పదం కావడంతో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆదివారం నాడు స్పందించారు. ఆ కార్యకర్త తన బంధువు అని, ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని మీడియాను కోరారు. ‘‘అతడు నా బంధువే. నా భుజంపై చేయి వేయాలనుకున్నాడు. నా బంధువే కావడంతో చేయి చేసుకున్నాను..ఆ తరువాత భజంపై చేయి వేయొద్దని చెప్పాను. బంధువుల మధ్య అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంది. మీరు ఈ విషయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అతడిని కాస్త గట్టిగా కొట్టిన మాట వాస్తమే. కానీ.. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు. ఆ దృశ్యాలను పదే పదే చూపించి అతడిని పెద్ద నేతగా మారుస్తున్నారు’’ అని శివకుమార్ పేర్కొన్నారు. తన భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తను కర్ణాటక చీఫ్ చేయి చేసుకున్న విషయం తెలిసిందే.  అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నేత జీ మాదెగౌడను పరామర్శించేందుకు ఇటీవల డీకే శివకుమార్ వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవడంతో..శివకుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తాజాగా స్పందించిన ఆయన.. విషయాన్ని పెద్దది చేయవద్దని మీడియాను కోరారు. 

Updated Date - 2021-07-12T01:34:39+05:30 IST