అన్నామలై వర్సిటీలో చేరొద్దు

ABN , First Publish Date - 2022-04-04T09:44:25+05:30 IST

తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో డిస్టెన్స్‌(దూర) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆ వర్సిటీలో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) హెచ్చరించింది.

అన్నామలై వర్సిటీలో చేరొద్దు

దానికి ఎలాంటి అనుమతుల్లేవు: యూజీసీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో డిస్టెన్స్‌(దూర) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆ వర్సిటీలో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) హెచ్చరించింది. దూర విద్యకు సంబంధించి యూజీసీ నుంచి ఈ వర్సిటీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ ప్రకటించే వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని కోరింది. ‘‘అన్నామలై వర్సిటీ ఓపెన్‌, డిస్టెన్స్‌ విధానంలో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రకటన జారీ చేసినట్టు తెలిసింది. కానీ, యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కాబట్టి ఈ వర్సిటీలో ఎవరూ చేరవద్దు’’ అని యూజీసీ సెక్రటరీ రజనీశ్‌ జైన్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-04T09:44:25+05:30 IST