నిరాశ పడవద్దు..అందరికీ భాగస్వామ్యం

ABN , First Publish Date - 2021-01-19T05:50:03+05:30 IST

‘ఎవరూ నిరాశ పడవద్దు. అందరికీ సమ భాగస్వామ్యం లభిస్తుంది. అభివృద్ధి, పెండింగ్‌ పనుల బాధ్యత నాదే’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.

నిరాశ పడవద్దు..అందరికీ భాగస్వామ్యం
కేటీఆర్‌తో వీర్నపల్లి మండల మహళా ప్రజాప్రతినిధులు

సిరిసిల్ల, జనవరి 18 (ఆంఽఽధ్రజ్యోతి): ‘ఎవరూ నిరాశ పడవద్దు. అందరికీ సమ భాగస్వామ్యం లభిస్తుంది. అభివృద్ధి, పెండింగ్‌ పనుల  బాధ్యత నాదే’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. సోమ వారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో వీర్నపల్లి మండల ప్రజాప్రతి నిధులు, ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు, అసంతృప్తి పెరిగిపోతుందని ప్రచారం సాగుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగలోకి దిగి మండల నాయకులతో భేటీ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే తంగళ్లపల్లి, గంభీరావుపేట మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు భరోసా  కల్పించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో వీర్నపల్లి మండలంలోని ప్రజాప్రతి నిధులతో భేటీ అయ్యి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్‌ కమిటీ ఏర్పా టుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ గుగులోతు కళావతి సురేష్‌ నాయక్‌, ఎంపీపీ మాలోతుబూల సంతోష్‌నాయక్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T05:50:03+05:30 IST