కల్వర్టు శిథిలమవుతున్నా పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-06-14T04:51:03+05:30 IST

మండలంలోని కొర్వీపల్లి-గజగట్లపల్లి రోడ్డుపై నిర్మించిన కల్వర్టు శిథిలమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

కల్వర్టు శిథిలమవుతున్నా పట్టించుకోరా?
కొర్వీపల్లి-గజగట్లపల్లి రహదారిపై శిథిలమవుతున్న కల్వర్టు

చిన్నశంకరంపేట, జూన్‌ 13: మండలంలోని కొర్వీపల్లి-గజగట్లపల్లి రోడ్డుపై నిర్మించిన కల్వర్టు శిథిలమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొర్వీపల్లి గ్రామ చెరువుకు ఆనుకొని కల్వర్టు ఉండడంతో చెరువు నిండినప్పుడల్లా కల్వర్టు నుంచే నీరు పారుతుంది. ప్రస్తుతం కల్వర్టు పూడకపోవడంతో పాటు రోడ్డు కుంగడంతో ప్రమాదం పొంచి ఉంది. కల్వర్టు మరమ్మతుల కోసం స్థానికులు అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదు. ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. 


 

Updated Date - 2021-06-14T04:51:03+05:30 IST