పాణ దాతలు..కరోనా బాధితులు

ABN , First Publish Date - 2020-09-19T09:39:52+05:30 IST

కరోనా రోగులకు ముందుండి వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.

పాణ దాతలు..కరోనా బాధితులు

వైరస్‌ బారిన పడుతున్న ఏఎన్‌ఎంలు, ఆశాలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


నల్లగొండ  అర్బన్‌, సెప్టెంబరు 18 : కరోనా రోగులకు ముందుండి వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. 7నెలలుగా నిర్విరామంగా విధి నిర్వహణలో పాల్గొంటూ కరోనా రోగులకు సేవలందిస్తున్న వారు ప్రస్తుతం అదే రోగాన బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు మొదలు పట్టణ ప్రాంతాల్లో సైతం వైద్య సిబ్బంది నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలు అందిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రబలిన నాటి నుంచి విధి నిర్వహణలో ఒత్తిడి పెరగడంతో పాటు ఈ వైరస్‌ బారిన పడిన వారి సందేహాలను నివృత్తి చేయడంలో ఏఎన్‌ఎంలు, ఆశాలు కీలక ప్రాత పోషిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఓ వైపు గర్భిణులు, చిన్నపిల్లలకు వైద్య సేవలందిస్తూనే కరోనా నియంత్రణ కోసం పాటుపడుతున్నారు. వారి పరిధిలో కరోనా సోకిన వ్యక్తికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్టులు మొదలుకుని ఆ వ్యక్తి కలిసిన వారందరికీ కరోనా టెస్టులు చేయించడ ంలో వారి పాత్ర అమోఘం.


అలాంటి వారు ప్రస్తుతం  కరోనా బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 40మందికి పైగా ఈ వైరస్‌ సోకగా నల్లగొండ పట్టణంలోనే సుమారు 25మంది వరకు ఏఎన్‌ఎంలు, ఆశాలు ఈ వైరస్‌ బారిన పడ్డారు. రోగులకు వైద్య సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి కరోనా బారిన పడిన సిబ్బంది ఇంటికెళ్లి డీఎంహెచ్‌వో  అన్నిమళ్ల కొండల్‌రావు పరామర్శించి వారికి బాసటగా నిలుస్తున్నారు. అధైర్యపడకుండా ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఆదుకోవాలని కరోనా బారిన పడిన సిబ్బంది కోరుతున్నారు. 


కరోనా బారిన పడిన సిబ్బందిని ఆదుకుంటాం 

జిల్లావ్యాప్తంగా ఏడు నెలలుగా వైద్య సిబ్బంది కరోనా నియంత్రణ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి సేవలు వెలకట్టలేనివి. కరోనా బారిన పడిన వైద్య సిబ్బందిని అన్ని విఽధాలా ఆదుకుంటాం ఎవరూ అధైర్యపడవద్దు. కరోనా బారిన పడిన వారిని ఆదుకునేందుకు కలెక్టర్‌తో చర్చించి కొంత ఆర్థిక సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా సుమారు 40మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారందరినీ స్వయంగా పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా కోలుకుని ప్రజలకు మరిన్ని సేవలందించాలి.  

- అన్నిమళ్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌ఓ

Updated Date - 2020-09-19T09:39:52+05:30 IST