స్థలం అగ్రిమెంట్‌ను తహసీల్దార్‌కు అందిస్తున్న దాత పులిశేఖర్‌రెడ్డి
మద్దికెర, డిసెంబరు 2: మండలంలోని పెరవలి గ్రామంలో ప్రజలకు వైద్యసేవల భవనాల కోసం రూ.18 లక్షలు విలువ చేసే 1.3 ఎకరాల పొలాన్ని గ్రామానికి చెందిన ఇష్టిరెడ్డి నాగిరెడ్డి, వెంకటరమణమ్మ దంపతుల కుమారుడైన పులిశేఖర్‌రెడ్డి, శ్యామల దంపతులు విరాళంగా అందజేశారు. గురువారం తహసీల్దార్ నాగభూషణమ్‌కు ఆ స్థలానికి చెందిన అగ్రిమెంట్లను అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ దాత ముందుకు వచ్చి స్థలం ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు చేపట్టే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కారుమంచి మల్లికార్జున, ఆర్ఐ రవికుమార్, గ్రామపెద్దలు రామలింగారెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.