Abn logo
May 9 2021 @ 00:01AM

ఆలయాభివృద్ధికి విరాళం

రుద్రవరం, మే 8: మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో నిర్మాణం చేపడుతున్న వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం బి.నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భూమా వెంకట్‌రెడ్డి, పాపమ్మ దంపతులు రూ.25,116 వేల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. ఈ విరాళం ఆలయ అభివృద్ధి నిమిత్తం ఉపయోగిస్తామని కమిటీ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వారణాసి గోపిశర్మ, పద్మశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement