రక్తదానం చేసి.. ప్రాణదాతలుకండి : కమిషనర్‌

ABN , First Publish Date - 2021-06-22T06:25:46+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదా నం చేసి ప్రాణదాతలు కావాలని మున్సిపల్‌ కమిషనర్‌ బండిశేషన్న పే ర్కొన్నారు.

రక్తదానం చేసి.. ప్రాణదాతలుకండి : కమిషనర్‌
గుంతకల్లు మున్సిపల్‌ కార్యాలయంలో రక్తదానం

గుంతకల్లు టౌన, జూన 21: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదా నం చేసి ప్రాణదాతలు కావాలని మున్సిపల్‌ కమిషనర్‌ బండిశేషన్న పే ర్కొన్నారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద లైఫ్‌ బ్లడ్‌ సొసైటీ ఆధ్వర్యంలో త లసేమియా బాధితుల కోసం సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పా టు చేశారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గర్భిణులు, తలసేమియా బాధితులకు కరోనా సమయంలో రక్తం దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో లైఫ్‌బ్లడ్‌ సొసైటీ రక్తదానం శిబిరా న్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. అనంతరం 93 మంది రక్తదా నం చేశారు. దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ ఎంఈ విశ్వనాథ్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ ఇషాక్‌, లైఫ్‌ బ్లడ్‌ సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మ, కోశాధికారి సెథిల్‌ ఆరోగ్యరాజ్‌, సభ్యులు లారెన్స, జిలాన, గులామ్‌సాబ్‌, మోహన; శివ, సతీష్‌ పాల్గొన్నారు.


సమాజసేవ అందరి బాధ్యత: వైద్యాధికారి

కళ్యాణదుర్గం: సమాజసేవ అందరిబాధ్యత అని వైద్యాధికారి కృష్ణవేణి పేర్కొన్నారు. సోమవారం దుర్గం రక్తదాతలు, లయన్సక్లబ్‌ ఆధ్వర్యంలో సం యుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఇద్దరు మహిళలతోపాటు 39 మంది రక్తదానం చేసినట్లు అధ్యక్షుడు కంబాలతిమ్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో లయన్సక్లబ్‌ అధ్యక్షుడు పగడాల మల్లికార్జున, సభ్యులు ర మేష్‌, పాటిల్‌ ఉదయ్‌రెడ్డి, ఫరీద్‌, కుమారి గంగ, భవాని, డాక్టర్‌ వేమన, డాక్టర్‌ సాయి, ల్యాబ్‌టెక్నీషియన్లు వరప్రసాద్‌, ప్రవీణ్‌, సోమశేఖర్‌, రాజు, ఏఎనఎంలు భీమక్క, రాఘవేంద్ర గుప్తా, చల్లాకిషోర్‌, ఓబుళరాజు, పరం ధామరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వసంతకుమార్‌, రాజేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:25:46+05:30 IST