Mehul Choksi పై అక్రమ చొరబాటు కేసు ఉపసంహరించుకున్న డొమినికా

ABN , First Publish Date - 2022-05-21T03:42:40+05:30 IST

రొసావ్ : పీఎన్‌బీ మోసం కేసులో నిందితుడు, పరారీలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని నమోదయిన కేసును ఉపసంహరించుకున్నట్టు డొమినికా అధికారులు ప్రకటించారు.

Mehul Choksi పై అక్రమ చొరబాటు కేసు ఉపసంహరించుకున్న డొమినికా

రొసావ్ : పీఎన్‌బీ మోసం కేసులో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడనే అభియోగాలపై నమోదయిన కేసును ఉపసంహరించుకున్నట్టు డొమినికా అధికారులు ప్రకటించారు. తన అభీష్టానికి విరుద్ధంగా అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి డొమినికాకు కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారని మెహుల్ ఛోక్సీ తరపు న్యాయవాదుల వాదనలతో డొమినికా కోర్ట్ ఏకీభవించింది. అక్రమంగా ప్రవేశించారంటూ నమోదయిన కేసును కొట్టివేస్తున్నట్టు నోటీసులు ఆదేశాలు జారీచేసింది. కాగా గతేడాది మే నెలలో డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా చొరబడ్డాడని అభియోగాలు నమోదు చేశారు. అయితే భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా(RAW) అధికారులు తనను కిడ్నాప్ చేశారని, నౌకలో అంటిగ్వా నుంచి డొమినికాకు ఎత్తుకెళ్లారని మెహుల్ ఛోక్సీ కోర్ట్‌కు తెలిపారు. కాగా వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ ఛోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం నిందితుడిగా ఉన్నాడు. మేనల్లుడు నీరవ్ మోడీతో కలిసి పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-21T03:42:40+05:30 IST