పచ్చసొన తింటే కొలస్ట్రాల్‌ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

ABN , First Publish Date - 2022-07-07T17:57:17+05:30 IST

కోడిగుడ్డులో పచ్చసొన ఎంత వరకూ మంచిది? ఇది తింటే కొలస్ట్రాల్‌ పెరుగుతుందా? ఇతర ఆరోగ్య సమస్యలు

పచ్చసొన తింటే కొలస్ట్రాల్‌ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

కోడిగుడ్డులో పచ్చసొన ఎంత వరకూ మంచిది? ఇది తింటే కొలస్ట్రాల్‌ పెరుగుతుందా? ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. పచ్చసొన తినటం వల్ల ఎలాంటి హాని ఉండదని.. దీనిని తినటం వల్ల ప్రొటీన్లు వస్తాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. 


పచ్చసొనలో ఉండేవివే...

రిబోప్లేవిన్‌: మన ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది. ఇది పచ్చసొనలో సమృద్ధిగా ఉంటుంది. 

విటమిన్‌ డి: ఆరోగ్యవంతమైన ఎముకలకు ఇది అత్యవసరం. కేవలం ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన శరీరంలో హారోన్లు సక్రమంగా పనిచేయాలంటే విటమిన్‌ డి అవసరం. 

విటమిన్‌ బి-12 : మన శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటుగా పచ్చసొనలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు మెదడును చురుకుగా ఉంచటంలోను, బరువు తగ్గించటంలోను కీలకమైన పాత్ర పోషిస్తాయి. 


ఎన్ని తినాలి?

గుండె జబ్బులు లేనివారి ప్రతి రోజు రెండు పచ్చసొనలను తినవచ్చు. గుండె జబ్బు ఉన్నవారు రోజుకు ఒక సొన తినవచ్చు.

Updated Date - 2022-07-07T17:57:17+05:30 IST