దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడు

ABN , First Publish Date - 2022-07-05T05:52:01+05:30 IST

దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో సోమవారం తొలి తెలంగాణ ఉద్యమ అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి వేడులకను పట్టణ కురుమ సంఘం ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడు
వర్థంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల టౌన్‌, జూలై 4: దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో సోమవారం తొలి తెలంగాణ ఉద్యమ అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి వేడులకను పట్టణ కురుమ సంఘం ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి హాజరై అన్నపూర్ట చౌరస్తాలో ఉన్న కొమురయ్య విగ్రహాన్ని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌ రావు, కౌన్సిలర్లు కూసరి అనీల్‌, కొరె గంగ మల్లు, నాయకులు రాజు, మల్లయ్య, భగవాన్‌ రాజ్‌ ఉ న్నారు. అలాగే కురుమ యువ చైతన్య సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్థంతిని ఘనంగా నిర్వహించి కొమురయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అ ధ్యక్షుడు దయాల మహేష్‌, రాజ్‌కుమార్‌, మహేష్‌, రంజిత్‌, శ్రీనివాస్‌, రాజమల్లు, కొమురయ్య ఉన్నారు.

Updated Date - 2022-07-05T05:52:01+05:30 IST