వైద్యుడిపై దాడిని ఖండిస్తూ జూనియర్‌ డాక్టర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-07-27T06:45:05+05:30 IST

ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ కృష్ణన్‌ నంబూద్రిపై రోగి బంధువుల దాడిని ఖండిస్తూ జూనియర్‌ డాక్టర్లు సోమవారం ధర్నా చేశారు.

వైద్యుడిపై దాడిని ఖండిస్తూ  జూనియర్‌ డాక్టర్ల ధర్నా
ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు

ఎర్రగడ్డ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ కృష్ణన్‌ నంబూద్రిపై రోగి బంధువుల దాడిని ఖండిస్తూ జూనియర్‌ డాక్టర్లు సోమవారం ధర్నా చేశారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సుమారు 40 మంది జూనియర్‌ డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ జూనియర్‌ వైద్యుల సంఘం డాక్టర్‌లు మాట్లాడుతూ.. రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులపై దాడి చేయడం తగదన్నారు. జూనియర్‌ వైద్యుడిపై ఏడుగురు దాడిచేస్తే పోలీసులు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. అందరినీ తక్షణమే అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ జూనియర్‌ డాక్టర్లకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. 



Updated Date - 2021-07-27T06:45:05+05:30 IST