వైద్యులు నడిచే దేవుళ్లు

ABN , First Publish Date - 2022-07-02T06:19:02+05:30 IST

వైద్యులు కులమతాలకు అతీతంగా అందరూ పూజించే దేవుళ్లని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు.

వైద్యులు నడిచే దేవుళ్లు
మాట్లాడుతున్న అన్నా రాంబాబు

గిద్దలూరు టౌన్‌ : వైద్యులు కులమతాలకు అతీతంగా అందరూ పూజించే దేవుళ్లని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం నగర పంచాయతీలోని ప్రభుత్వఏరియా వైద్యశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని ప్రసంగించారు. కరోనా సమయంలో ప్రాణాలొడ్డి బాఽధితులకు చికిత్సలు చేసిన గొప్పవారన్నారు. సేవాదృక్పథంతో విధులు నిర్వహిస్తున్న ప్రతి వైద్యసిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సురేష్‌ప్రభుచే ఎంపి నిధులు మంజూరు కాగా వాటి నుండి కొత్త అంబులెన్స్‌ను మంజూరు కాగా ఎమ్మెల్యే రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్‌ కోటా నరసింహులు, వైద్యశాల అభివృద్ది కమిటీ సభ్యులు డాక్టర్‌ జె.వి.నారాయణ, మేకల బయ్యన్నయాదవ్‌, బండారు నిర్మలదేవి, మాజీ ఎంపిపి కడప వంశీధర్‌రెడ్డి, వైసీపీ నాయకులు ముద్దర్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 

మన్నే రవీంద్రకు సన్మానం

ఎర్రగొండపాలెం :   నాడి పట్టి వైద్యం చేయడంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు ప్రముఖవైద్యులు డాక్టరు మన్నె రవీంద్ర  దిట్ట అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సంధర్బంగా  శుక్రవారం సాయంత్రం రవీంద్ర నర్సింగ్‌హాం టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. పశ్శిమ ప్రకాశంలో పేద ప్రజలకు  వైద్య సేవలు అందించుచూ అనేక వైద్యశిభిరాలు ఏర్పాటు చేసిపేద ప్రజలకు ప్రాణదాతగ పేరు పొందారని అన్నారు. ఎర్రగొండపాలెం ప్రాంతం కాకుండా, నల్గోండ, మహాబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలనుంచి రోగులు వచ్చి ఇక్కడ చికిత్సలు పొందుతారని అన్నారు.  కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేటలో..

బేస్తవారపేట : డాక్టర్‌డే సందర్భంగా బేస్తవారపేట వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బేస్తవారపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్‌డే వేడుకలు నిర్వహించారు.వైద్యాధికారి టి.చైతన్య చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేయించారు.డాక్టర్‌ వృతి ఎంతో పవిత్రమైనదని కరోనా సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడరని వాసవీ క్లబ్‌ అధ్యక్షులు విశ్వనాధుని జగదీష్‌ కుమార్‌ అన్నారు. ఈకార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు బి.సునీల్‌,పి.గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఇక ఆయా నియోజకవర్గాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్‌ డే వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2022-07-02T06:19:02+05:30 IST