వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి..

ABN , First Publish Date - 2020-06-07T10:10:45+05:30 IST

వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎం, ఏఎస్‌హెచ్‌ఏ కార్యకర్తలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ కె శశాంక సూచించారు

వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి..

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎం, ఏఎస్‌హెచ్‌ఏ కార్యకర్తలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ కె శశాంక సూచించారు. శనివారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో కోర్‌ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్నరోజుల్లో కోవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. పాజిటివ్‌ కేసులకు కరీంనగర్‌లో చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమలో డీఎంహెచ్‌వో  డాక్టర్‌ సుజాత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల తదితరులు పాల్గొన్నారు.


జిల్లాకు మంజూరైన 6,494 డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ మున్సిపల్‌ కమిషనర్‌, డీఆర్డీవో, మిషన్‌భగీరథ, సీపీవో అధికారులతో అర్బన్‌ డబుల్‌బెడ్‌రూం గృహ నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 


జిల్లాలో అర్హతకలిగిన చిన్నమధ్యతరగతి పరిశ్రమలకు 20శాతం మూలధన రుణాలను  మంజూరు చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ తెలంగాణ, ప్రధానకార్యదర్శి సూచనల మేరకు అర్హత గల రుణగ్రహీతలందరికీ ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ కింద రుణాలు పొడిగించినట్లు తెలిపారు. 


హరితహారంలో మొక్కలు నాటేందుకు శాఖల వారీగా ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో హరితహారంపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. 


జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక బుకింగ్‌, డెలివరీలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు అధిగమించాలన్నారు.


కరీంనగర్‌ టౌన్‌: నగరంలో సర్కస్‌గ్రౌండ్‌ పార్కు పనులను కలెక్టర్‌ కె శశాంక పరిశీలించారు. పార్కులో నిర్మించిన వాకింగ్‌ ట్రాక్‌, గ్రీనరీ, బస్‌బేను పరిశీలించారు. అంబేద్కర్‌ స్టేడియం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కాంట్రాక్టర్లను ఆదేశించారు. 


Updated Date - 2020-06-07T10:10:45+05:30 IST