చేతులు కలిసేనా..?

ABN , First Publish Date - 2022-05-24T06:13:18+05:30 IST

అధికారానికి దూరమై దశాబ్దా కాలానికి దగ్గర పడుతున్న హస్తం పార్టీ నేతలు ఐక్యత వైపు అడుగులు వేసినట్లు కనిపించడం లేదు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. వరుస ఓటములతో పూర్తిగా డీలా పడిపోయిన నేతలకు గుణపాఠం కలిగినట్లే కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను మరింత డీలా చేసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు వ్యూహారచన చేస్తున్నా తిప్పికొట్టే కనీస ప్రయత్నం చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిస్తున్న ఎవరికీ వారే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంద్రవెల్లి బహిరంగ సభ తర్వాత జిల్లాలో పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహాంగా కనిపిస్తున్నారు. ఆదివాసీలకు అండగా ఉంటామని పార్టీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన ఆ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నమే జరుగడం లేదు.

చేతులు కలిసేనా..?
రచ్చబండలో మాట్లాడుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(ఫైల్‌)

రచ్చబండతో ప్రజల్లోకి కాంగ్రెస్‌ 

వరంగల్‌ డిక్లరేషన్‌ తర్వాత స్పీడు పెంచిన నేతలు

గ్రూపు విభేధాలతో విసుగెత్తిపోతున్న శ్రేణులు 

పలుచబడిన పార్టీ 

చేరికలపైనే భారీ ఆశలు

ఆదిలాబాద్‌, మే23 (ఆంధ్రజ్యోతి): అధికారానికి దూరమై దశాబ్దా కాలానికి దగ్గర పడుతున్న హస్తం పార్టీ నేతలు ఐక్యత వైపు అడుగులు వేసినట్లు కనిపించడం లేదు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. వరుస ఓటములతో పూర్తిగా డీలా పడిపోయిన నేతలకు గుణపాఠం కలిగినట్లే కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను మరింత డీలా చేసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు వ్యూహారచన చేస్తున్నా తిప్పికొట్టే కనీస ప్రయత్నం చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిస్తున్న ఎవరికీ వారే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంద్రవెల్లి బహిరంగ సభ తర్వాత జిల్లాలో పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహాంగా కనిపిస్తున్నారు. ఆదివాసీలకు అండగా ఉంటామని పార్టీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన ఆ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నమే జరుగడం లేదు. 

మావల మండలం వాఘాపూర్‌లో రచ్చబండ.. 

ఇటీవల పార్టీ పిలుపుతో మావల మండలం వాఘాపూర్‌లో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదో ఒక రోజు హడావిడి చే సి ఆ తర్వాత అంతా సైలెంటైపోయినట్లుగానే కనిపిస్తుంది. రచ్చబండ కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జి మహేశ్వర్‌రెడ్డి ముందే కొందరు నేతలు జిల్లాలో పార్టీ పరిస్థితిపై బహిరంగ విమర్శలు చేయడం అసలైన నాయకత్వం లేక పోవడంతో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా అధికారానికి దూరం కావడంతో కొందరు ముఖ్య నేతలు, సీనియర్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌, బీజేపీలో చేరిపోవడంతో పార్టీకి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. కొత్త నాయకత్వం పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోవడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగానే కనిపిస్తుంది. 

రైతులు అండగా నిలుస్తారా?

కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా రైతులకు దగ్గరయ్యేందుకే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దృ ష్టిలో పెట్టుకుని రైతులకు వరాలను కురిపించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను రైతులు ఏ మేరకునమ్ముతారో, ఎన్నికల సమయంలో అండగా నిలుస్తారా..? లేదన్నదే ప్రశ్నార్థకంగా మారుతుంది. వరంగల్‌ డిక్లరేషన్‌పై ప్రజల్లో మంచి స్పందనే కనిపిస్తున్న ఇంటింటికీ డిక్లరేషన్‌ అంశాలను తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు ఏ విధంగా సక్సెస్‌ అవుతారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల పాటు రచ్చబండ కార్యక్రమంతో గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడం అనేది అంత సులువైన పనేమి కాదంటున్నారు. పదిరోజుల్లో వానకాల పంటల సాగు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో రైతులు బిజిబిజీగా మారి సాగు పనులకు పరిమితం కానున్నారు. ప్రధానంగా పంటల మద్దతు ధర లు, రూ.2లక్షల రుణమాఫీ, ఎకరాన రూ.15వేల రైతుబంధు పథకం లాంటి కార్యక్రమాలపై రైతుల్లో ఆసక్తి కనిపిస్తుంది. అయితే పార్టీ శ్రేణులు డిక్లరేషన్‌ అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నదే ప్ర ధాన సమస్యగా కనిపిస్తుంది.

చెల్లాచెదురైన క్యాడర్‌..

జిల్లా అగ్రనేతల మధ్య ఐక్యత లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ముఖ్య కార్యకర్తలు తలోదారిలో పార్టీకి దూరమయ్యారు. జిల్లాలో మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావులు చెరో గ్రూ పునకు నాయకత్వం వహించడంతో జిల్లా నేతల మధ్య విభేధాలు ముదురుతున్నాయి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతున్న నేతలెవరూ గట్టిగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో తలమడుగు, బజార్‌హత్నూర్‌, ఉట్నూ ర్‌, ఆదిలాబాద్‌ పట్టణంలో పార్టీకి కొంత పట్టు కనిపిస్తున్న మిగితా చోట్ల సర్పంచ్‌ స్థానం కూడా గెలువలేని పరిస్థితులున్నాయి. డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ పార్టీ ముఖ్య నేతలను కలుపుకుని పోవడం లేదన్న వాదనలున్నాయి. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడనే చెప్పవచ్చు. ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌సుజాత పార్టీ పిలుపుతో కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీలపై మరింత దూ కుడు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. 

Updated Date - 2022-05-24T06:13:18+05:30 IST