కుటుంబసభ్యులకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా?

ABN , First Publish Date - 2021-04-21T06:28:53+05:30 IST

వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక మరూరు చెర్లోపల్లి ఆశావర్కర్‌ ఆత్మహత్యాయ త్నం చేసుకుంటే... ఆమెకు న్యాయం చేయకపోగా...కౌంటర్‌ కేసు లు పెట్టిస్తావా...మీ ఇంట్లో మీ అక్కకో, చెల్లిలికో జరిగితే ఇలాగే వ్య వహరిస్తావా... అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు.

కుటుంబసభ్యులకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

 రాప్తాడు ఎమ్మెల్యేపై పరిటాల శ్రీరామ్‌ ఘాటు వ్యాఖ్యలు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 20 : వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక మరూరు చెర్లోపల్లి ఆశావర్కర్‌ ఆత్మహత్యాయ త్నం చేసుకుంటే... ఆమెకు న్యాయం చేయకపోగా...కౌంటర్‌ కేసు లు పెట్టిస్తావా...మీ ఇంట్లో మీ అక్కకో, చెల్లిలికో జరిగితే ఇలాగే వ్య వహరిస్తావా... అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు. స్థానిక అరవింద్‌నగర్‌లోని తన నివాసంలో పరిటాల శ్రీరామ్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  వైసీపీ నాయకుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చే సుకుని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆశావర్కర్‌ కురుబ అనితను మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించిన తరువాత ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఉలికి పాటుతో లేనిపోని ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.  నియోజకవర్గం లో ఒక్క అభివృద్ధి పనులు చేయ కపోగా దందాలు, రియల్‌ఎస్టేట్‌ పంచాయతీ లు, లేఅవుట్లలో అక్రమ వసూళ్లు, చివరకు గోడౌన్లు, చిన్న పిల్లల చిక్కీలు, పాల సరఫరాలో కూడా కక్కుర్తికి పడుతున్నది మీరు కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించా రు. దందాలు చేయడం కాదు... ప్రజలకు సేవ చేయడం నేర్చుకో అంటూ హితవు పలి కారు. మీకు చేతనైతే నన్ను ఊరు, జిల్లా విడిపించి చూడు త రువాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్నారు. మిమ్మల్ని ఎడ్లబండ్లకు కట్టి ఈడ్చుకెళ్లే రోజులు దగ్గర పడ్డాయని సవాల్‌ విసిరారు. మా తాత, మా మామలు నువ్వు నిక్కరు వేసుకునే రోజుల్లోనే కాంట్రాక్ట ర్లని....అడ్డదారిలో సంపాదించాల్సిన అవస రం వారికి లేదన్నారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేశారో ప్రజలు చూస్తున్నారని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసునే నీరు గార్చిన మీకు...ఆశా వర్కర్‌పై లైంగిక వే ధింపుల కేసును నీరుగార్చడం పెద్ద లెక్కకాదన్నారు. వెంటనే చేసిన తప్పును ఒప్పు కుని బాధితురాలు ఆశా వర్కర్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 


Updated Date - 2021-04-21T06:28:53+05:30 IST