బుద్ధుని బోధ‌: ఇత‌రుల కంటే తక్కువగా ఉన్నామని కుమిలిపోతున్నారా?.. మీ సామ‌ర్థ్యాన్ని ఇలా గుర్తిస్తే.. మీదే విజయం!

ABN , First Publish Date - 2021-11-18T12:33:56+05:30 IST

ఒకానొక‌ప్పుడు బుద్ధుడు ఒక గ్రామంలో బ‌స చేశాడు.

బుద్ధుని బోధ‌: ఇత‌రుల కంటే తక్కువగా ఉన్నామని కుమిలిపోతున్నారా?.. మీ సామ‌ర్థ్యాన్ని ఇలా గుర్తిస్తే.. మీదే విజయం!

ఒకానొక‌ప్పుడు బుద్ధుడు ఒక గ్రామంలో బ‌స చేశాడు. ఆయనను చూసేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి బుద్ధునితో..దయచేసి ఈ జీవితానికున్న విలువ ఏమిటో చెప్పండి.. అని అడిగాడు. బుద్ధుడు ఆ వ్యక్తికి ఒక రాయిని ఇచ్చి, ఈ రాయి ధర తెలుసుకున్న తర్వాత ఇక్క‌డికి రండి.. అప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని అన్నాడు. దీంతో ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ అతను ఒక దుకాణం వద్దకు వెళ్లి, ఈ రాయిని చూసి.. దాని ఖరీదు ఎంత ఉంటుందో చెప్పండి అని అడిగాడు. దుకాణ‌దారు ఆ రాయిని ప‌రిశీలించాడు. ఈ రాయితో తనకు ఉపయోగం లేదు అని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి.. కూరగాయలు అమ్మే వ్యక్తి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. ఆ రాయిని చూసి కూరగాయలు అమ్మేవాడు ఈ బంగాళదుంపల మూట తీసుకుని ఈ రాయిని నాకు ఇవ్వు అని అడిగాడు. అయితే ఆ వ్య‌క్తి ఆ వ్యక్తి రాయిని తీసుకుని స్వర్ణకారుని ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆ రాయిని చూపించాడు.  




స్వర్ణకారుడు ఆ రాయిని చూసి, ఈ రాయికి బదులుగా నేను నీకు వెయ్యి బంగారు నాణేలు ఇస్తాను అని అన్నాడు. ఆ వ్యక్తి రాయిని అమ్మేందుకు నిరాకరించాడు. దీంతో ఆ స్వ‌ర్ణ‌కారుడు నువ్వు ఎంత ధర చెప్పినా ఇస్తాను అని అన్నాడు. తాను ఈ రాయిని అమ్మాల‌నుకోవడం లేద‌ని, కేవ‌లం ధర తెలుసుకోవాలనుకుంటున్నాన‌న్నాడు. తరువాత ఆ వ్య‌క్తి ఆ రాయిని తీసుకుని నగల వ్యాపారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. నగల వ్యాపారి ఆ రాయిని చూసి, ఇది ఎంతో అమూల్యమైనదని, దీనికి వెలకట్టలేమని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత బుద్ధుని దగ్గరకు తిరిగి వచ్చాడు.  అత‌నిని చూడ‌గానే బుద్దుడు.. ఇప్పుడు చెప్పండి  ఆ రాయి విలువ ఎంత?.. అని అడిగాడు.. ఈ రాయికి కూరగాయలు విక్రేత ఒక‌ బస్తా బంగాళాదుంపలు ఇస్తాన‌న్నాడ‌ని, స్వర్ణకారుడు లెక్కకుమించిన బంగారు నాణేలు ఇస్తాన‌న్నాడ‌ని, నగల వ్యాపారి ఇది ఎంతో అమూల్యమైనదని చెప్పాడ‌ని ఆ వ్య‌క్తి బుద్దునికి తెలిపాడు.


వెంట‌నే బుద్ధుడు.. ఇది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ వజ్రాలే.. అయితే ఇతరులను ఆశ్ర‌యిస్తే వారు మ‌న‌ల్ని త‌క్కువగా అంచ‌నా వేస్తారు. అందుకే మన సామర్థ్యాలను ఇతరులతో పోల్చుకోకూడదు. మ‌న సామ‌ర్ధ్యాన్ని త‌గిన‌విధంగా ఎవ‌రూ నిర్ణ‌యించ‌లేరు. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఇతరుల కంటే తక్కువవారిగా భావించకండి అని ఈ ఉదాహ‌ర‌ణ ద్వారా బుద్ధుడు లోకానికి బోధించాడు.

Updated Date - 2021-11-18T12:33:56+05:30 IST