కథలు చెబుతారా?

ABN , First Publish Date - 2020-05-09T08:28:41+05:30 IST

ఎప్పుడూ ఆటలేనా? రోజంతా కంప్యూటర్‌ లేదా టీవీ చూడడమేనా? కాస్త సమయమైనా చదవడానికి కేటాయించకపోతే స్కూల్స్‌

కథలు చెబుతారా?

ఎప్పుడూ ఆటలేనా? రోజంతా కంప్యూటర్‌ లేదా టీవీ చూడడమేనా? కాస్త సమయమైనా చదవడానికి కేటాయించకపోతే స్కూల్స్‌ ప్రారంభమయ్యాక ఇబ్బందిపడతారు. అందుకే కాసేపు ఇష్టమైన పుస్తకాల్లో కథలు చదవండి. మీకు తెలిసిన కథలు చెప్పండి.

  1. చదవండి అనగానే పాఠ్యపుస్తకాలు తీయాల్సిన పనిలేదు. ఇంటికి రోజూ పేపర్‌ వస్తుంది కదా! అందులో పిల్లల పేజీలో ఉన్న సమాచారం చదవండి. ఇంట్లో మ్యాగజైన్‌ లేదా కథల పుస్తకాలు ఉంటే మరీ మంచిది. రోజూ వాటిలో నుంచి ఒక కథ చదవండి. రైమ్స్‌ కూడా చదవొచ్చు.
  2. చదవడమంటే మామూలుగా కాదు, బిగ్గరగా చదవాలి. అప్పుడే మీరు తప్పులు చదివితే తెలుస్తుంది.
  3. రోజూ సాయంత్రం మమ్మీ, డాడీతో పాటు కూర్చుని మీకు తెలిసిన, చదివిన కథను చెప్పండి.
  4. స్మార్ట్‌ ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో మోరల్‌ స్టోరీస్‌ అని వెతికితే బోలెడు కథలు దొరుకుతాయి. వాటిని చదవండి. మీరు చదివిన కథలను స్నేహితులకు షేర్‌ చేయండి.
  5. కథలు చదవడం వల్ల నైతిక విలువల గురించి తెలుసుకుంటారు. భాషపై పట్టు పెరుగుతుంది.

Updated Date - 2020-05-09T08:28:41+05:30 IST