Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రేమిస్తావా..? చావమంటావా..?

twitter-iconwatsapp-iconfb-icon
ప్రేమిస్తావా..? చావమంటావా..?చికిత్స పొందుతున్న బాలాజీనాయక్‌

వివాహిత ప్రేమకోసం గొంతుకోసుకున్న యువకుడు

అనంతపురం క్రైం, ఆగస్టు 19: వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. తనను ప్రేమించాలని అప్పట్లోనే కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. నాలుగేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. అయినా తనను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. ఒప్పుకోకపోవడంతో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం నగరంలోని పాపంపేట కాలనీలో శుక్రవారం జరిగింది. నగరంలోని తపోవనం ఎల్‌బీనగర్‌కు చెందిన బాలాజీ నాయక్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన డిప్లొమా పూర్తి చేశాడు. ఓ వివాహిత అతనికి చిన్ననాటి స్నేహితురాలు. అప్పట్లోనే తన ప్రేమను తిరస్కరింనా.. ఆమెను మరిచిపోలేదు. తనచూ ఫోనలో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో మళ్లీ తనను ప్రేమించాలని కోరడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె కొన్న నెలల నుంచి స్పందించడం మానేసింది. ఈ క్రమంలో బాలాజినాయక్‌ పాపంపేటలో ఆ వివాహిత ఇంటికి శుక్రవారం వెళ్లాడు. ఆమె భర్త ఉద్యోగ విధులకు ఇంటి నుంచి వెళ్లిపోగానే లోపలికి  వెళ్లాడు. తనను ప్రేమించాలని, లేకపోతే చనిపోతానని బెదిరించాడు. ఆ ఇంట్లో ఉన్న కత్తితో తన గొంతు కోసుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన ఆ వివాహిత, అతన్ని బయటకు తీసుకువచ్చింది. కేకలు వేయడంతో పాటు బాలాజీనాయక్‌ సోదరుడు రవికి ఫోన చేసి సమాచారం తెలియజేసింది. హుటాహుటిన నగరంలోఓని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతపురం రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలాజీ నాయక్‌ గొంతుకు ఆపరేషన చేసి, ఆబ్జర్వేషనలో ఉంచినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. 


ప్రేమిస్తావా..? చావమంటావా..?ప్రాణాలతో బయట పడిన తల్లి అపర్ణ, కూతురు, సింధు

ఎంతపని చేశావమ్మా..!

బిడ్డతో కాలువలో దూకిన మహిళ

తల్లిని కాపాడిన స్థానికులు

హంద్రీనీవా నీటిలో చిన్నారి గల్లంతు

ఆత్మకూరు ఆగస్టు 19: కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యకు యత్నించింది. పంపనూరు సమీపంలోని కాలువలోకి ఓ కూతురుతో కలిసి దూకింది. స్థానికులు గమనించి, గట్టుపై ఉన్న బాలికను, దూకిన తల్లిని రక్షించారు. ప్రవాహంలో మరో కూతురు గల్లంతైంది. ఈ విషాద ఘటన ఆత్మకూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు, పట్టణానికి చెందిన అపర్ణను అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని కురుగుంటకు చెందిన శివకుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సింధు (6), వైష్ణవి(18 నెలలు) కూతుళ్లు ఉన్నారు. భర్తతో వివాదం కారణంగా అపర్ణ తన బిడ్డలతో కొన్నేళ్లుగా పుట్టింట్లో ఉంటోంది. స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. శివకుమార్‌ తరచూ వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామానికి వచ్చిన శివకుమార్‌, తనతో వచ్చేయాలని భార్యతో గొడవపడ్డాడు. ఈ కారణంగా అపర్ణ మనస్తాపం చెంది, బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. పంపనూరు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంది. చిన్న కూతురును ఎత్తుకుని కాలువలోకి దూకింది. పెద్దకూతురు గట్టుమీద ఉండిపోయింది. సమీపంలో ఉన్నవారు గమనించి, వెంటనే కాలువలోకి దూకి అపర్ణను గట్టుకు చేర్చారు. కానీ పసిబిడ్డ వైష్ణవి నీటిలో కొట్టుకుపోయింది. క్షణికావేశంలో కన్నబిడ్డను పోగొట్టుకున్న అపర్ణ  కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి, మరో కూతురు పోలీసుల సంరక్షణలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.