Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 12 Feb 2022 22:07:38 IST

పామును పట్టుకోవాలని చూసిన డేగ.. కొద్దిసేపు పోరాటం తర్వాత చివరికి ఏం జరిగిందంటే..

twitter-iconwatsapp-iconfb-icon

పాముకు డేగకు మధ్య సాధారణంగానే వైరం ఉంటుంది. పైన ఎక్కడో ఆకాశంలో సాగిపోయే డేగ.. నేల మీది పాములు తదితరాలను గమనిస్తూ లటుక్కున వచ్చి.. ఛటుక్కున ఎత్తుకుపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో కూడా ఇలాగే డేగకు, పాముకు పోరాటం జరిగింది. పామును ఎత్తుకుపోవాలని డేగ, డేగ బారి నుంచి తప్పించుకోవాలని పాము విశ్వప్రయత్నాలు చేస్తాయి. చివరికి ఏమైందో తెలుసుకుందాం..





పామును చూస్తే డేగలు అస్సలు ఆగవు. నోట కరుచుకుని ఎత్తుకుపోయే వరకూ నిద్రపోవు. కంటికి కనిపించనంత ఎత్తులో ఉన్న డేగలు.. కళ్లు మూసి తెరిచేలోగా వాటి పని అవి చేసుకుని పోతాయి. ఇలాగే ఈ వీడియోలో కూడా ఓ డేగ పైనుంచి రయ్.. మంటూ వచ్చి నేల మీద కదులుతోన్న పామును పట్టుకుంది. దాని నుంచి విడిపించుకునేందుకు పాము, దాన్ని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని డేగ పోరాటం చేశాయి. అయితే అనూహ్యంగా పాము డేగ కాలిని చుట్టుకుంటుంది. దీంతో చతికిలపడిన డేగ.. గిలగిలలాడుతుంది. ఎంత పెనుగులాడినా దాని నుంచి తప్పించుకోలేకపోతుంది. ఇంతలో ఓ వ్యక్తి ఇదంతా గమనించి పాము బారి నుంచి డేగను కాపాడుతాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


బోనులో సింహమే కదా.. ఏం చేస్తుందిలే అనుకుని తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆ యువతి గొంతులో పచ్చి ఆకుల ఆనవాళ్లు.. అనారోగ్యంతోనే నవవధువు చనిపోయిందనుకున్నారు కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో..పురావస్తు తవ్వకాల్లో ఆశ్చర్యకర పరిణామం.. ఒక్కోటి 40 కిలోల వరకు బరువున్న గుండ్రటి... ఇంతకీ, అవేంటంటే..Viral Video: రైలు పట్టాలు దాటుతోన్న 20 ఏళ్ల యువతి.. హఠాత్తుగా కదిలిన గూడ్సు రైలు.. ఓ వ్యక్తి చేసిన రిస్క్ ఇదీ..!videoఅంతా చూస్తుండగా బీభత్సం సృష్టించిన కారు.. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొని.. చివరకు..videoViral Video: తల్లి ప్రేమను అర్థం చేసుకోమంటూ.. కొడుక్కి ఈ కుక్క ఎంత బాగా చెప్పింది... మీరే చూడండి..videoభార్య, నలుగురు పిల్లలతో పెళ్లికి వెళ్లి కారులో తిరిగొస్తున్న భర్త.. అర్ధరాత్రి 12 గంటలకు అతడు సజీవదహనం.. అసలేమైందంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.