కాల్‌ రికార్డింగ్‌ తెలుసా!

ABN , First Publish Date - 2021-08-21T08:23:55+05:30 IST

సాధారణంగా ఫోన్‌కాల్‌ను రికార్డింగ్‌ చేయవచ్చనే సంగతి అందరికీ తెలుసు. ‘వాట్సాప్‌ కాల్‌’కూ

కాల్‌ రికార్డింగ్‌ తెలుసా!

సాధారణంగా ఫోన్‌కాల్‌ను రికార్డింగ్‌ చేయవచ్చనే సంగతి అందరికీ తెలుసు.  ‘వాట్సాప్‌ కాల్‌’కూ  ఈ సౌకర్యం ఉంది. అధికారికంగా అందుకు వెసులుబాటు లేకున్నప్పటికీ, రికార్డింగ్‌ చేసేందుకు  మార్గం ఉంది. 



‘వాట్సాప్‌’ అందించే అనేకానేక ఫీచర్లలో వాయిస్‌ కాలింగ్‌ ఒకటి. అయితే వాటిని రికార్డింగ్‌ చేసుకునేందుకు మాత్రం మూడో పార్టీ యాప్‌ను ఉపయోగించుకోవాలి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెంటిలోనూ చేసుకోవచ్చు. ఈ మూడో పార్టీని ‘వాట్సాప్‌’ మాత్రం ప్రోత్సహించదు. 


ఆండ్రాయిడ్‌

దీంట్లో రికార్డింగ్‌ కోసం ‘క్యూబ్‌ కాల్‌’ రికార్డర్‌ లేదంటే సరిగ్గా అలాంటి యాప్‌ను మొదట డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

 యాప్‌ ఓపెన్‌ చేసి రికార్డు చేయాలనుకునే కాంటాక్ట్‌కు డయల్‌ చేయాలి. 

 యాప్‌లో ‘క్యూబ్‌ కాల్‌’ విడ్జెట్స్‌ కనిపిస్తే చాలు, మీ కాల్‌ రికార్డు అవుతున్నట్టే లెక్క

 ఫోన్‌లో ఎర్రర్‌  కనిపిస్తే, యాప్‌ను రీఓపెన్‌ చేయాలి. 

 యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి, వాయిస్‌ కాల్‌లో ఫోర్స్‌ వాయిస్‌ని క్లిక్‌ చేయాలి. అప్పుడు ఎలాంటి ఎర్రర్స్‌ ఎదురుకావు. 


యాపిల్‌ ఐ ఫోన్‌   

యాపిల్‌ ఐఓఎస్‌ వినియోగదారులు కూడా వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. అందుకు ‘మేక్‌’ ఉండాలి.  లైట్నింగ్‌ కేబుల్‌తో ‘మేక్‌’కు కనెక్ట్‌ కావాలి. కంప్యూటర్‌ను ట్రస్ట్‌ చేయి అంటూ పాపప్‌ కనిపిస్తుంది. ఎస్‌ అని దానిపై క్లిక్‌ చేయాలి. 


మొదటిసారి ‘మేక్‌’కు కనెక్ట్‌ చేస్తుంటే, క్విక్‌ టైమ్‌ ఆప్షన్‌ దగ్గరకు వెళ్ళాలి. ఫైల్‌ సెక్షన్‌లో ఉన్న న్యూ ఆడియో రికార్డింగ్‌ ఆప్షన్‌ దగ్గరకు లీడ్‌ చేస్తుంది. ప్రాసెస్‌ అంతా పూర్తయ్యాక క్విక్‌టైమ్‌ రికార్డ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. తదుపరి వాట్సాప్‌ కాల్‌ చేయాలి. కాల్‌ కనెక్ట్‌ కాగానే యూజర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. కాల్‌ రీసీవ్‌ కాగానే రికార్డింగ్‌ కూడా మొదలవుతుంది. 



Updated Date - 2021-08-21T08:23:55+05:30 IST