మినీ రిజర్వాయర్‌ కలేనా?

ABN , First Publish Date - 2022-07-19T05:18:27+05:30 IST

ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజాప్రతి నిధులు మారుతున్నారు. కానీ, మినీ రిజర్వాయర్‌ ఏర్పా టు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ఏటా పంటలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మూడు దశాబ్దాలుగా మినీ రిజర్వాయర్‌ ఏర్పాటు కలగానే మిగలడంతో అన్నదాతలకు నిరాశ తప్పడం లేదు.

మినీ రిజర్వాయర్‌ కలేనా?
ధర్మవరం పెద్ద చెరువు

 ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం
 ఆందోళనలో రైతులు
(ఎచ్చెర్ల)

ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజాప్రతి నిధులు మారుతున్నారు. కానీ, మినీ రిజర్వాయర్‌ ఏర్పా టు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ఏటా పంటలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మూడు దశాబ్దాలుగా మినీ రిజర్వాయర్‌ ఏర్పాటు కలగానే మిగలడంతో అన్నదాతలకు నిరాశ తప్పడం లేదు. వివ రాల్లోకి వెళితే.. ఎచ్చెర్ల మండలం ధర్మవరం పెద్ద చెరు వు కింద ఆయకట్టుదారులు మినీ రిజర్వాయర్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 175.38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరు వును మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రజాప్రతి నిధులు హామీ ఇస్తున్నారు. కానీ, మూడు దశాబ్దాలుగా ఆ హామీ నెరవేరడం లేదు. 1993-94లో కాంగ్రెస్‌ ప్రభు త్వ హయాంలో తొలిసారిగా మినీ రిజర్వాయర్‌ ప్రతి పాదన వచ్చింది. అప్పట్లో మఽధ్యతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, ఆనాటి చిన్నతరహా నీటి పారుదల శాఖా డాక్టర్‌ పి.శంకర రావుతో  స్వయంగా పెద్ద చెరువును సందర్శించారు. కానీ ఇప్పటివరకు మినీ రిజర్వాయర్‌ ఏర్పాటు చేయ కపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నారా యణపురం కుడి కాలువ కింద ఉన్నా.. ధర్మవరం, తదితర శివారు ప్రాంతాలకు ఏటా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. రైతులకు ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రావడం లేదు. ధర్మవ రం పెద్దచెరువు కింద 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కొంతమేర చెరువు ఆక్రమణకు గురైంది. మదుములు పాడయ్యాయి. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గింది. వర్షాకాలంలో ముద్దాడ ఊటగెడ్డ మీదుగా వర్షపు నీరు భారీగా ధర్మవరం పెద్ద చెరువులో చేరుతుంది. ఈ చెరువు నుంచి సమీపంలోని బొంతలకోడూరు వద్ద వృధాగా కలిసిపోతోంది. ఈ నీరు వృధా కాకుండా.. సద్వినియోగం చేసేందుకు అప్పట్లో మినీ రిజర్వా యర్‌ ప్రతిపాదన వచ్చింది. మినీ రిజర్వాయర్‌ ఏర్పాటైతే ధర్మవరం, పొన్నాడ, కొంగరాం తదితర గ్రామాల రైతులు ప్రయోజనం చేకూరుతుంది.

పెట్టుబడి రావడంలేదు
ధర్మవరం పెద్ద చెరువు కింద సుమారు 15 ఎకరాల ఆయకట్టు సాగు చేస్తున్నాం. నారాయణపురం కుడి కాలువ ద్వారా అతి కష్టమ్మీద సాగునీరు ఏటా ఖరీఫ్‌లో చేరుతుంది. నీరు సరిగా అందక పంట దిగుబడి రావడంలేదు. మినీ రిజర్వాయర్‌ ఏర్పాటైతేనే ఈ ప్రాంత రైతుల కష్టాలు గట్టెక్కుతాయి.
- ముద్దాడ వెంకటరమణ, రైతు, ధర్మవరం

కష్టమే దక్కుతోంది
నాకు ఉన్న పొలంతో పాటు, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 3 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. కష్టమే తప్ప ఫలితం దక్కడం లేదు. చాలా ఏళ్ల నుంచి మినీ రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలి.
- బట్న అడవివాడు, రైతు, ధర్మవరం


Updated Date - 2022-07-19T05:18:27+05:30 IST