మాకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2021-03-05T05:42:27+05:30 IST

ఒప్పంద అధ్యాపకులు గా పనిచేస్తున్న తమను మీరే ఆదుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని పాలిటెక్నిక్‌ కళాశాలల ఒప్పం ద అధ్యాపకులు వేడుకున్నారు.

మాకు న్యాయం చేయండి
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి వినతి పత్రం ఇస్తున్న ఒప్పంద అధ్యాపకులు

   పుష్పశ్రీవాణికి ఒప్పంద అధ్యాపకుల వినతి

జియ్యమ్మవలస, మార్చి 4: ఒప్పంద అధ్యాపకులు గా పనిచేస్తున్న తమను మీరే ఆదుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని పాలిటెక్నిక్‌ కళాశాలల ఒప్పం ద అధ్యాపకులు వేడుకున్నారు. గురువారం ఉప ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆమెకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ల్లో జీవో ఎంఎస్‌ నెంబరు 138 ద్వారా 323 మంది ఒప్పం ద అధ్యాపకులు పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా 405 పాలిటె క్నిక్‌ అధ్యాపకుల పోస్టులు విడుదల చేస్తే ప్రస్తుతం ఫలి తాలు విడుదల చేశారన్నారు. ఇదే జరిగితే మొత్తం మా 323 మందిలో 259 మంది బతుకు తెరువు కోల్పోతామని కన్నీటి పర్యాంతమయ్యారు. 2015 ఆర్‌పీఎస్‌ ప్రకారం మాకు న్యాయంగా రావలసిన రూ.40,270లు ఇప్పించాల ని వినతిపత్రంలో  కోరారు. స్పందించిన ఉప ముఖ్యమం త్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.

 

 


Updated Date - 2021-03-05T05:42:27+05:30 IST