Advertisement
Advertisement
Abn logo
Advertisement

మమ్మల్ని తొలగించొద్దు

- అదనపు కలెక్టర్‌ సమక్షంలో రాజ్‌వీర్‌ ఇండస్ట్రీ కార్మికుల ఆవేదన


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబరు 4 : పది పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను ఉన్నట్లుం డి విధులనుంచి తొలగిస్తే తాము ఏమి కావాలని జిల్లా కేంద్రంలోని రాజ్‌వీర్‌ ఇండస్ట్రీ (కాటన్‌మిల్‌) కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకో వడం లేదని పేర్కొన్నారు. శనివారం రెవెన్యూ స మావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలె క్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌ అధ్యక్షతన కార్మికులు, మిల్లు యాజమాన్యంతో సమీక్షా సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సమావేశంలో కార్మికులు మాట్లా డుతూ ఏళ్ల తరబడి మిల్లులో 175 మందిమి కార్మి కులుగా పని చేశామని, అకస్మాత్తుగా మాలో 70 మందిని తొలగిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రణాళికా బద్ధంగా 175 మందిమి పనిచేస్తామని, మాలో ఎవరిని కూడా తొలగించవద్దని వారు విజ్ఞ ప్తి చేశారు. అలాగే మాకు ఇవ్వవలసిన పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని కోరారు, ఈ విషయంపై ఇండ స్ట్రీ లీగల్‌ అడ్వయిజర్లు మాట్లాడుతూ నిబంధనలు, ఇండస్ట్రీ లాస్‌ (నష్టానికి కారణాలు)కు కారణాలను అదనపు కలెక్టర్‌కు వివరించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 15లోపు కార్మికుల సమ స్యలను పరిష్కరించేందుకు ఐఆర్‌పీతో మాట్లాడా లని, ఈ లోపు ఒక తేదీని ఏర్పాటు చేసుకొని కార్మికులతో సమావేశం కావాలని, రాజ్‌వీర్‌ ఇండస్ట్రీ మేనేజర్‌ సీతారామయ్యను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ పద్మశ్రీ, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, అర్భన్‌ తమసిల్దారు పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement