తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలను మరవొద్దు

ABN , First Publish Date - 2021-09-18T07:40:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వ ర్యంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపాల వద్ద నివాళు లర్పించారు. అమరవీరుల సేవలను పలువురు కొనియాడారు.

తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలను మరవొద్దు
భవనగిరి మండలం నాగిరెడ్డి గ్రామ శివారులో రావి నారాయణరెడ్డి స్తూపం ఎదుట నివాళులర్పిస్తున్న చెరుపల్లి సీతారాములు

సీపీఎం  కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం  ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వ ర్యంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపాల వద్ద నివాళు లర్పించారు.  అమరవీరుల సేవలను పలువురు కొనియాడారు. 

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు  17: తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలను మరవద్దని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరు పల్లి సీతారాములు అన్నారు.భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులోని రావి నారాయణరెడ్డి స్మారక స్తూపం ఎదుట. వలిగొండ మండలం  పులిగిల్ల గ్రామంలో అమర వీరుల స్మారక స్తూపాల ఎదుట,  బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లి వెంకిర్యాల గ్రామాల్లో సాయుధ పోరాట యోధుడు కొమ్మిడి కోదండరాంరెడ్డి విగ్రహానికి, అమర వీరుల స్మారక స్తూపాల ఎదుట,   భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో అమర వీరుల స్మార స్తూపాల ఎదుట, రావి నారాయణ రెడ్డి జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.జిల్లాకు రావి నారాయణ రెడ్డి పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మోటకొండూరులో  సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణలు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన, సీపీఎం నాయకులు గూడూరు అంజిరెడ్డి, కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దయ్యాల నర్సింహ, బట్టుపల్లి అనురాధ, పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించిన సీఎం: బీజేపీ

భూదాన్‌పోచంపల్లిలోని ఇందిరానగర్‌ కాలనీలోని అంబేద్కర్‌ భవనం ఎదుట బీజేపీ మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు గంజి బస్వలింగం ఆధ్వర్యంలో, వలిగొండలో తహసీల్దార్‌ కార్యాలంయ ఎదుట  జాతీయ జెండాను ఎగుర వేశారు. భువనగిరిలో బీజేపి పట్టణ అధ్యక్షుడు పాదరాజు ఉమాశంకర్‌రావు, ఏబీవీపి జిల్లా కన్వీనర్‌ సుర్వి మణికంఠ వేర్వేరుగా జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలం గాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గతంలో ప్రక       టించిన సీఎం కేసీఆర్‌ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు.  ఎంఐఎం పార్టీకి  సీఎం కొమ్ముకాస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించారని ఆరోపించారు.

Updated Date - 2021-09-18T07:40:03+05:30 IST