విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
నవాబుపేటలో రైతుల ధర్నా
పెనుగంచిప్రోలు, జూలై 1: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానానికి స్వస్తి పలకాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నవాబుపేట విద్యుత్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. రైతు సంఘం నాయకులు పి.వి.ఆంజనేయులు, చనమోలు సైదులు, రైతు ప్రముఖులు నంబూరి వాసు, చింతా గంగాధర్, భాస్కరరావు, నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.