లైసెన్సు లేకుండా వాహనాలు నడపొద్దు
ABN , First Publish Date - 2022-08-19T04:51:40+05:30 IST
ఎలాంటి పర్మిట్ లేకుండా వాహనాలు నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జయరాములు తెలిపారు. మండల కేంద్రంలోని రామాపురం మూడు రోడ్ల కూడలి వద్ద గురువారం సాయంత్రం వాహనాలను ఆయన తనిఖీ చేశారు.
రామాపురం, ఆగస్టు 18: ఎలాంటి పర్మిట్ లేకుండా వాహనాలు నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జయరాములు తెలిపారు. మండల కేంద్రంలోని రామాపురం మూడు రోడ్ల కూడలి వద్ద గురువారం సాయంత్రం వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, టూవీర్ల యజమానులకు ఆయన అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలన్నారు. ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.