వైద్య నివేదికల్లో జాప్యం వద్దు

ABN , First Publish Date - 2022-05-21T06:32:57+05:30 IST

కొవిడ్‌ మరణాలు, మలేరియా, డెంగ్యూ జ్వరాల కేసుల వివరాలను ప్రతిరోజూ జిల్లా మలేరియా అధికారి, ఎపిడిమాలజిస్ట్‌ విభాగాలకు తప్పనిసరిగా పంపించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి సూచించారు

వైద్య నివేదికల్లో జాప్యం వద్దు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి

విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ మరణాలు, మలేరియా, డెంగ్యూ జ్వరాల కేసుల వివరాలను ప్రతిరోజూ జిల్లా మలేరియా అధికారి, ఎపిడిమాలజిస్ట్‌ విభాగాలకు తప్పనిసరిగా పంపించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నివేదికలు అందించే విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించవద్దన్నారు. జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాస్ర్తి మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ డైలీ రిపోర్ట్‌కు ఒక కాంటాక్ట్‌ పర్సన్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా మలేరియా అధికారి మణి మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మలేరియా, డెంగ్యూ కేసుల సమాచారం ఐడీఎస్‌పీ నమూనా ప్రకారం  ప్రతిరోజూ అందించాలన్నారు. దీనివల్ల మలేరియా ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. డెంగ్యూ కేసులు పాజిటివ్‌గా డిక్లేర్‌ చేయాలంటే ఎలిసా టెస్ట్‌ ద్వారా మాత్రమే గుర్తించాలని, అది ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ సీహెచ్‌.శ్రీధర్‌, డెమో బి.నాగేశ్వరరావు, వుమెన్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.ఉమావతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T06:32:57+05:30 IST