Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ మాయ మాటలు నమ్మొద్దు

  1. ప్రజాదరణ కోల్పోతున్న వైసీపీ ప్రభుత్వం 
  2. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ


ఆలూరు, డిసెంబరు 5: వైపీపీ నాయకులు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మవద్దని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. ఆదివారం ఆలూరు మండలంలోని మరకట్టు గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన సలువప్ప తాత   గోపుర కలశ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజు రోజుకూ వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆదరణ కోల్పోతున్నదని అన్నారు. సంపాదనే ధ్యేయంగా వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు వ్యవహరి స్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు సులక్షణరెడ్డి, టీడీపీ నాయకులు హుసేనప్ప, సర్పంచ్‌ కుమారుడు రాజు, వెంకటేష్‌, ఉచ్చీరప్ప, హనుమంతు, కోట్ల యూత్‌ రాము, లక్ష్మన్న, ఉచ్చీరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. 

Advertisement
Advertisement