బియ్యం పంపిణీకి కరోనా నిబంధనలు వర్తించవా..?

ABN , First Publish Date - 2021-05-18T06:04:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్ద కే రేషన పంపిణీ కార్యక్రమం పట్టణంలో అపహాస్యమవుతోంది.

బియ్యం పంపిణీకి కరోనా నిబంధనలు వర్తించవా..?
బియ్యం పంపిణీ వాహనం వద్ద గుమిగూడిన జనం

‘ఇంటి వద్దకే రేషన’లో గుంపుగా లబ్ధిదారులు


పామిడి, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్ద కే రేషన పంపిణీ కార్యక్రమం పట్టణంలో అపహాస్యమవుతోంది. రేషనను ఇంటి వద్ద పంపిణీ చేయకుండా వీధిలో ఒకచోట వాహనాన్ని పెట్టి పంపి ణీ చేపడుతున్నారు. దీంతో జనం గుంపులుగా ఎగబడుతున్నారు. కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించడంలేదు. దీంతో బియ్యం పంపిణీకి కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులలో చాలా మంది కనీసం మాస్కు కూడా వేసుకోకపోవడం గమనార్హం.

Updated Date - 2021-05-18T06:04:42+05:30 IST