chennai: డీఎంకే ఎంపీకి ఒకరోజు పోలీసు కస్టడీ

ABN , First Publish Date - 2021-10-14T15:22:15+05:30 IST

కార్మికుడి హత్యకేసులో లొంగిపో యిన డీఎంకే ఎంపీ రమేష్‌ను ఒకరోజు పోలీసు కస్టడీకి కడ లూరు కోర్డు అనుమతి ఇచ్చింది. కడలూరు జిల్లా మణికుప్పం డీఎంకే ఎంపీ రమేష్‌కు సొంత మైన జీడి తోటలో ప

chennai: డీఎంకే ఎంపీకి ఒకరోజు పోలీసు కస్టడీ

                    - కడలూరు కోర్టు ఉత్తర్వులు


ప్యారీస్‌(చెన్నై): కార్మికుడి హత్యకేసులో లొంగిపోయిన డీఎంకే ఎంపీ రమేష్‌ను ఒకరోజు పోలీసు కస్టడీకి కడలూరు కోర్డు అనుమతి ఇచ్చింది. కడలూరు జిల్లా మణికుప్పం డీఎంకే ఎంపీ రమేష్‌కు సొంతమైన జీడితోటలో పనిచేస్తున్న గోవిందరాజ్‌ దారుణహత్యకు గురికాగా, ఈ కేసుపై విచారణ చేపట్టిన సీబీసీఐడీ, ఎంపీ రమేష్‌, ఆయన సహాయకుడు నటరాజన్‌, జీడితోట మేనేజర్‌ కందవేల్‌, కార్మికులు అల్లాపిచ్చై, సుందర్‌, వినోద్‌ తదితరులపై హత్యాకేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 9న నటరాజన్‌సహా ఐదుగురిని అరెస్టు చేయగా, ఎంపీ రమేష్‌ బన్రూట్టి మేజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం ఎంపీ రమేష్‌ను రెండు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్‌ దీప కడలూరు కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రభాకరన్‌, ఎంపీ రమేష్‌ను ఒకరోజు కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపేందుకు పోలీసులకు అనుమతులు జారీచేశారు.

Updated Date - 2021-10-14T15:22:15+05:30 IST