Abn logo
Jan 25 2021 @ 06:45AM

కాంగ్రెస్‌ సొంత ప్రచారాన్ని స్వాగతిస్తున్నాం

డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌

చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరిం చుకొని కాంగ్రెస్‌ సొత ప్రచారం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని డీఎంకే ప్రధాన కార్య దర్శి దురైమురుగన్‌ అన్నారు. పాత కాట్పాడిలో ఆదివారం డీఎంకే ఆధ్వర్యంలో ప్రజా గ్రామసభ జరిగింది. ఈ సభలో దురైమురుగన్‌ మాట్లాడుతూ, డీఎంకే అధికారం చేపట్టిన వెంటనే అందించిన టీవీలు ఇంకా పనిచేస్తున్నాయని, కానీ, అన్నాడీఎంకే అందిం చిన ఫ్రిజ్‌, మిక్సీ, గ్రైండర్లు పాత సామానుల దుకాణాలకు వెళ్లాయన్నారు. డీఎంకే అధికారం చేపట్టిన వెంటనే కాట్పాడిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఎలాంటి విభేధాలు లేవన్నారు. సభలో ప్రాంత సెక్రటరీలు సునీల్‌ కుమార్‌, వన్నియరాజ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement