25 మందికి ఒక్కరే..

ABN , First Publish Date - 2021-09-01T05:18:35+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంహె చ్‌వో)లో డిప్యూటేషన్లపై వచ్చిన వారిని యథా స్థానాలకు పంపి ప్రక్షాళన చేయాలనుకున్న అధికారుల ఆశలు అడియాశలయ్యాయి.

25 మందికి ఒక్కరే..
డీఎంహెచ్‌వో కార్యాలయం

డీఎంహెచ్‌వోలో డిప్యూటేషన్ల కొనసాగింపు

ఆ ఒక్కరికీ కార్యాలయంలో ప్రత్యేక బాధ్యతలు

మాతృస్థానాలకు బదిలీలు హడావుడీకే పరిమితం 

డిప్యూటేషన్లపై వచ్చిన వారంతా యథాస్థానాల్లోనే విధులు

ఉద్యోగోన్నతులతో కీలక స్థానాలు వస్తాయన్న వారిలో నిరాశ


జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  కార్యాలయం (డీఎంహెచ్‌వో) లో డిప్యూటేషన్ల ను రద్దు చేసి.. వారిని  మాతృస్థానాలకు పంపాలన్న ఆదేశాలు అమలు కాలేదు. ఏడాది క్రితం.. గత నెల 16వ తేదీలోపు చేసిన హడావుడీకి ముగింపు పలికారు. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల నుంచి 25 మంది డిప్యూ టేషన్‌పై వచ్చి జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తుం డగా వారిలో ఒక్కరిని మాత్రమే మాతృ స్థానానికి పంపారు. ఆ ఒక్కరూ కూడా మన స్థాపం చెందకుండా డీఎంహెచ్‌వో కార్యాల యంలో ప్రత్యేక సీటు కేటాయించి ఖాళీ సమయాల్లో వచ్చి విధులు నిర్వహించాలని సూచించారు. 


గుంటూరు(జీజీహెచ్‌), ఆగస్టు 31 : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంహె చ్‌వో)లో   డిప్యూటేషన్లపై వచ్చిన వారిని యథా స్థానాలకు పంపి ప్రక్షాళన చేయాలనుకున్న అధికారుల ఆశలు అడియాశలయ్యాయి. డిప్యూ టేషన్‌పై వచ్చినవారు మాతృస్థానాలకు వెళ్లిపో తారని, అర్హత ఉన్నవారికి ఉద్యోగోన్నతులు వస్తా యని.. కీలకమైన పోస్టులు లభిస్తాయని.. భావిస్తున్న వారు నిరాశకు గురయ్యారు.  డిప్యూటేషన్‌లపై వచ్చిన వారందరిని పంపించాలని ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేసింది. ఆ తర్వాత గత నెల 16 లోపు మాతృస్థానాలకు పంపించాలని మళ్లీ హడావుడి చేసింది. ఈ ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో డిప్యూ టేషన్‌పై వచ్చిన వారు ఉద్యోగ విరమణ అయ్యే వరకు ఇక్కడే ఉంటారేమోనన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.  ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘ నాయకులు కూడా నోరు మెదపకపో వడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. డిప్యూటేషన్‌పై ఉన్న వారందరినీ మాతృ స్థానాలకు పంపాలన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలు, జేసీలు అమలు చేశారు. కాని మన జిల్లా అధికారుల రూటే సప రేటు అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి నెలకొంది. డిప్యూటేషన్‌పై క్రోసూరు, గోరంట్ల, మాడుగుల, తెనాలి వంటి 25 పీహెచ్‌సీల నుంచి వివిధ కారణాలు చూపుతూ 25 మందికి పైగా జిల్లా కేంద్రంలో కొన్నేళ్లుగా తిష్ఠ వేశారు. వీరందరికి వచ్చిన పనులు అయిపోయాయి. అయినా ఏదో ఒక పని కల్పించుకుంటూ, ఉన్నతాధికారులకు వారి సొంత పనులు చేసి పెడుతూ ఇక్కడే కాలక్షేపం చేస్తున్నారు. ఒక అధికారికి ప్రభుత్వ పరంగా సీసీ పోస్టు లేదు. కానీ డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన కోసం సీసీ పోస్టు కల్పించి మరీ విధులు నిర్వహింపజేస్తున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యూటేషన్‌పై వచ్చిన వారంద రూ 12 ఏళ్లు అవుతుంది.ఈ కారణంగా వారివారి మాతృస్థానాలైన పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. డిప్యూటేషన్‌పై జిల్లా కేంద్రానికి వచ్చిన వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు. దీంతో అక్కడ వీరు చేసే పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పై రవీలు, గుట్టుచప్పుడు కాకుండా మామూళ్లు వసూళ్లు, నర్సింగ్‌ పోస్టుల అమ్మకాల్లో కీలకపాత్ర పోషించడం లాంటి వ్యవహారాల్లో బిజీగా ఉండే వారు మాతృస్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి చూప డంలేదనే ఆరోపణలున్నాయి. అందుకే ప్రభుత్వం డిప్యూటేషన్‌పై వచ్చిన వారిని మాతృస్థానాలకు పంపాలని నిర్ణయించింది. అయితే  అధికారులు కూడా వారికే వంతపాడుతూ ప్రభుత్వ ఆదేశాల ను పక్కన పడేశారని తెలుస్తుంది.  


Updated Date - 2021-09-01T05:18:35+05:30 IST