కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచార వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్

ABN , First Publish Date - 2021-12-18T01:15:34+05:30 IST

అత్యాచారాన్ని అడ్డుకోలేకపోయినప్పుడు దానిని ఎంజాయ్ చేయడమే మేలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు ..

కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచార వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్

బెంగళూరు: అత్యాచారాన్ని అడ్డుకోలేకపోయినప్పుడు దానిని ఎంజాయ్ చేయడమే మేలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆ పార్టీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర విచారకరమని పేర్కొన్న ఆయన మరోమారు ఇలాంటి మరోమారు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. 


‘‘కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడిగా పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆ వ్యాఖ్యలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. కర్ణాటకలోని మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు మరోమారు రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నా’’ అని శివకుమార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పార్టీ విలువలకు ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధమని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని సూచించారు.  


రమేశ్ కుమార్ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి. దీంతో స్పందించిన ఆయన తన వ్యాఖ్యలు కనుక మహిళలను బాధిస్తే క్షమించాలని వేడుకున్నారు. మహిళలకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T01:15:34+05:30 IST