Advertisement
Advertisement
Abn logo
Advertisement

పక్కింట్లో మహిళ ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నాడా కుర్రాడు.. పదే పదే కాల్స్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం.. చివరకు ఊహించని సీన్..!

ఆ కుర్రాడు పక్కింట్లో ఉంటున్న వివాహిత ఫోన్ నెంబర్ సంపాదించాడు.. ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు.. ఆమె తన భర్తకు విషయం చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ఆ కుర్రాడు తన తీరు మార్చుకోలేదు.. పదే పదే కాల్స్ చేస్తూ ఆమెను వేధించాడు.. దీంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఉరేసుకుని చనిపోయింది.. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. 


జైపూర్‌కు సమీపంలోని లాడ్వా గ్రామానికి చెందిన భానా రామ్, సుమన్ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు ఉంటున్న పక్కింట్లో ముఖేష్ అనే యువకుడు ఉంటున్నాడు. గతేడాది అతను సుమన్ ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే సుమన్ అందుకు తిరస్కరించింది. భర్తకు విషయం చెప్పింది. దీంతో భానా రామ్ దూద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ముఖేష్‌ను పిలిపించిన పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా ముఖేష్ తీరు మారలేదు. 


పదే పదే సుమన్‌కు ఫోన్ కాల్స్ చేసి వేధించాడు. దీనిని తట్టుకోలేకపోయిన సుమన్ శుక్రవారం సాయంత్రం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో భానా రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement