విద్యార్థినికి జిల్లాస్థాయి ప్రశంసాపత్రం అందజేస్తున్న జేసీ హరేందిర ప్రసాద్
నాయుడుపేట, జనవరి 25 : జేసీ హరేందిర ప్రసాద్ నాయుడుపేట ఎల్‌ఎసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సంఽధ్యకు జిల్లాస్థాయి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. 10వ తరగతి చదువుతున్న సంధ్య జాతీయ ఓటర్ల సందర్భంగా జిల్లాస్థాయిలో జరిగిన వక్తృత్వ పోటీలో ప్రథమస్థానంలో నిలిచింది. మంగళవారం నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జేసీ ఆ విద్యార్థినికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నామణి సంధ్యను ప్రత్యేకంగా అభినందించారు.