పలు చోట్ల వర్షం

ABN , First Publish Date - 2020-05-26T10:11:19+05:30 IST

జిల్లాలో సోమవారం సాయంత్రం ఉరవకొండ, గుంతకల్లు, హిందూపురంలో వర్షం కురిసింది.

పలు చోట్ల వర్షం

ఉక్కపోత నుంచి ఉపశమనం


ఉరవకొండ/గుంతకల్లుటౌన్‌/హిందూపురం, మే25: జిల్లాలో సోమవారం సాయంత్రం ఉరవకొండ, గుంతకల్లు, హిందూపురంలో వర్షం కురిసింది. ఉరవకొండ పట్టణంలో సోమవారం సాయం త్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ స రఫరాలో అంతరాయం ఏర్పడింది. షేక్షానుపల్లి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన భారీ వ ర్షం కురిసింది. సుమారు గంట పాటు ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదు రు గాలులు దాటికి విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు  నేలకొరిగాయి. భారీ వర్షం కురవడం తో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వంకలు కూడా ప్రవహించాయి. షేక్షానుపల్లిలో పిడుగుపడి జనార్దన్‌నాయుడు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృతి చెందా యి. వామిదొడ్డిలో చెట్టుకు ఎద్దులు కట్టేసి ఉం డగా, చెట్టుపై పిడుగు పడడంతో ఎద్దులు అక్కడిక్కడే మృతి చెందాయి.


రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపాడు. గుంతకల్లు పట్టణం, మండలంలో సొమవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 4.30  గంటల నుంచి కురిసిన వర్షం ఉక్కపోత తో అల్లాడుతున్న ప్రజలకు  కాస్తా ఉపశమనం కలిగించింది. హిందూపురంలో సోమవారం సా యంత్రం అరగంటపాటు  వర్షం కురిసింది. దీం తో పట్టణంలోని కొన్నిచోట్ల మురుగు కాలువలు పొంగి నీరు రోడ్డుపైకి వచ్చింది. ఇదే సమయం లో వీచిన గాలితో కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. కొట్నూ రు కట్ట కింద చింతచెట్టు నేలకొరిగింది. మూడు రోజులుగా అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో అల్లాడుతుండగా ప్రజలు సా యంత్రం కురిసిన వర్షానికి  ఊపిరిపీల్చు కున్నారు.

Updated Date - 2020-05-26T10:11:19+05:30 IST