జిల్లా పురుషుల హాకీ జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-01-25T05:39:02+05:30 IST

పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో ఆదివారం జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదామస్తుల రమ ణ తెలిపారు

జిల్లా పురుషుల హాకీ జట్టు ఎంపిక
జిల్లా సీనియర్‌ హాకీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు

ఆర్మూర్‌రూరల్‌, జనవరి24: పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో ఆదివారం జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదామస్తుల రమ ణ తెలిపారు ఎంపిక పోటీలకు 50మంది క్రీడాకారులు హాజరు కాగా హాకీకోచ్‌ ఎండీ జావీద్‌ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 5వ తేదీ నుంచి సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్‌ఈఎల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్‌ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం కోశాదికారి పింజ సురేందర్‌, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, నగేష్‌, సుధీర్‌, నర్సింగ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T05:39:02+05:30 IST