13 నుంచి జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

ABN , First Publish Date - 2022-08-10T05:27:38+05:30 IST

శ్రీచెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి జానకమ్మలు స్మారక జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ నిర్వహించనున్నట్టు నిర్వాహకుడు వి.శ్రీకాంత్‌ తెలిపారు

13 నుంచి జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 9: శ్రీచెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి జానకమ్మలు స్మారక జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ నిర్వహించనున్నట్టు నిర్వాహకుడు వి.శ్రీకాంత్‌ తెలిపారు. విశాఖ వేలీ స్కూల్‌ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో అన్ని వయస్సుల క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 11వ తేదీలోగా  ఫోన్‌: 9989971232 నందు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 

Updated Date - 2022-08-10T05:27:38+05:30 IST