లోక్‌ అదాలత్‌లో రాజీ కేసులకు న్యాయబద్ధత

ABN , First Publish Date - 2022-08-03T05:30:00+05:30 IST

లోక్‌ అదాలత్‌లో రాజీపడే కేసులకు పూర్తి న్యాయబద్ధత ఉంటుందని దానికి అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ. పార్దసారధి తెలిపారు

లోక్‌ అదాలత్‌లో రాజీ కేసులకు న్యాయబద్ధత
సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ. పార్దసారధి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ.పార్దసారధి 

బాపట్ల,ఆగస్టు 3: లోక్‌ అదాలత్‌లో రాజీపడే కేసులకు పూర్తి న్యాయబద్ధత ఉంటుందని దానికి అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ. పార్దసారధి  తెలిపారు. బాపట్ల కోర్టు ప్రాంగణంలో బుధవారం ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.సాదుబాబు అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు కక్షిదారులంతా తమ సమస్యలను లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీచేసుకోవాలన్నారు. బాపట్ల పరిధిలోని పోలీసు, ఇతరశాఖల అధికారులు జాతీయ మెగా లోక్‌అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించాలని కోరారు జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ కేసులను రాజీ చేసుకోవటానికి కక్షిదారులకు మంచి అవకాశమని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి కె.రత్నకుమార్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఇ.అన్నామణి, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఆర్డీవో గంధం రవీందర్‌, బాపట్ల భార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నందనవనం ప్రసాద్‌, డిఎస్పీ ఎ.శ్రీనివాసరావు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-03T05:30:00+05:30 IST