కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌

ABN , First Publish Date - 2021-02-28T07:16:16+05:30 IST

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. జిల్లాలోని 27 కోర్టుల్లో లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంబించారు.

కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌
మాట్లాడుతున్న జిల్లా జడ్జి లక్ష్మణరావు

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం  : పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. జిల్లాలోని 27 కోర్టుల్లో లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని  ఆయన శనివారం ప్రారంబించారు. జిల్లాలో 8,253 కేసులను పరిష్కరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లోక్‌అదాలత్‌ తీర్పు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమని చెప్పారు. లోక్‌ అదాలత్‌ ఆవశ్యకతను శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పుండరీకాక్షుడు వివరించారు. తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి సీతారామకృష్ణారావు పాల్గొన్నారు. ఎనిమిదేళ్లుగా విడిపోయిన మూడు జంటలను  లోక్‌అదాలత్‌ ద్వారా  కలిపారు.  మచిలీపట్నానికి చెందిన తాతపూడి సాల్మన్‌ రాజు- శిరీషా,  సమరీన్‌ ఫాతిమా - ఆయూబ్‌ఖాన్‌, కాళ్ల గ్రామానికి చెందిన సూదాబత్తుల రజిత- వీర వెంకట నరసింహస్వామి న్యాయమూర్తుల ఎదుట దండలు మార్చుకున్నారు.  దీర్ఘకాలం తరువాత కలిసిన దంపతులకు నూతన ధుస్తులను అందించారు.  న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-02-28T07:16:16+05:30 IST