నేటినుంచి సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-05-06T06:15:07+05:30 IST

జిల్లాలో గురువారం నుంచి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. అయితే జిల్లాకు మంగళవారం కేవలం 40 వేల డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే సరఫరా కాగా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారు 3,56,089 మంది ఉన్నారు.

నేటినుంచి సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ

 మొదటి డోస్‌కు అనుమతి లేదన్న అధికారులు

వ్యాక్సిన్‌ వచ్చింది 40 వేల డోసులు

ఎదురు చూస్తున్నవారు 3,56,089


చిత్తూరు రూరల్‌, మే 5: జిల్లాలో గురువారం నుంచి  సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. అయితే జిల్లాకు మంగళవారం కేవలం  40 వేల డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే సరఫరా కాగా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారు 3,56,089 మంది ఉన్నారు.జిల్లాలో ఇప్పటి వరకు 5,73,116 మంది వ్యాక్సిన్‌ వేసుకోగా, ఇందులో కొవిషీల్డ్‌ 4,09,324, కొవాగ్జిన్‌ 82,814 మంది  వేయించుకున్నారు. ఇది కేవలం మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారి సంఖ్య. రెండో డోస్‌ కోసం ఇంకా 3,56,089 మంది ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లాకు వచ్చిన 40 వేల డోసులు ఏ మూలకు కూడా సరిపోవు. ఇక కొవాగ్జిన్‌ విషయానికి వస్తే అసలు ఆ ఊసే లేదు. ఈ వ్యాక్సిన్‌ సరఫరాపై అధికారుల్లో కూడా సమాచారం లేదు. ఒక్క కొవాగ్జిన్‌ రెండో డోస్‌కు 62,967 మంది ఎదురు చూస్తున్నారు. కాగా గురువారం జిల్లాలో 127 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు అధికారులు సిద్ధం చేశారు. కేవలం రెండో డోస్‌ వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఫస్ట్‌ డోస్‌ వేసుకుందామా అని ఎదురు చూస్తున్న వారి ఆశలు అడిఆశలు ఆయ్యాయి.


Updated Date - 2021-05-06T06:15:07+05:30 IST